RAM CHARAN RC16 : ఏ ఆర్ రెహమాన్ బర్త్ డే సందర్బంగా RC16 అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మైత్రి మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బుచ్చిబాబుతో చేస్తోన్న RC16 ప్రాజెక్టు లోకి ఏఆర్ రెహమాన్ ఎంట్రీ ఇచ్చినట్లు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
RAM CHARAN RC16 : ఏ ఆర్ రెహమాన్ బర్త్ డే సందర్బంగా RC16 అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

RC 16 - AR Rahman Birthday : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోతోన్న RC 16  గురించి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో టెక్నీషియన్స్ గురించి కానీ. మిగిలిన ఆర్టిస్టుల వివరాలు కానీ ఇంతవరకు రివీల్ చేయలేదు.అయితే ఆ మధ్య దర్శకుడు బుచ్చిబాబు ఓ సందర్భంలో  ఏ ఆర్ రహమాన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది కానీ ,.. మేకర్స్ అధికారికంగా ఎపుడూ ప్రకటించలేదు. ఇక.. ఇదే విషయాన్ని ఈ రోజు రహమాన్ బర్త్ డే సందర్బంగా రామ్ చరణ్ హ్యాపీ బర్త్ డే సర్ అంటూ రెహమాన్‌కు విషెస్ తెలియజేశాడు. చరణ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

రహమాన్ ను కలిసి విషెష్ తెలియజేసిన RC 16 నిర్మాతలు

ఇక.. రెహామన్ బర్త్ డే సందర్బంగా ఈ రోజు రెహమాన్‌ను RC 16 నిర్మాతలు ప్రత్యేకంగా కలిసి స్పెషల్‌గా విషెస్ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ట్విట్టర్ ద్వారా తలియజేశారు. ఆస్కార్ విజేత , పద్మభూషణ్ ఏ ఆర్ రహమాన్ గారూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ #RC16 ప్రాజెక్టులో మీరు భాగం అవుతున్నందుకు మాకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందని పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.. ఇక.. బుచ్చిబాబు, సుకుమార్, రెహమాన్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర

ఇక.. RC 16 మూవీ విషయానికి వస్తే .. ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండటంతో కన్నడ నాట కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. జైలర్ మూవీలో స్పెషల్ అప్పీరియస్ లో కనిపించి దుమ్ము రేపిన శివన్న ఈ మూవీలో సూపర్ రోల్ పోషిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో శివన్న చెప్పడం జరిగింది.

ఉత్తరాంధ్ర బ్యాక డ్రాప్

పాన్ ఇండియా రేంజ్లో అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మితమవుతున్న ఈ మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నడిచే గ్రామీణ కథ అని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫినిష్ అవగానే ఈ మూవీ సెట్స్ లోకి వెళ్తుందని సమాచారం.

ALSO READ:Thandel Glimpse video: పాకిస్తాన్ అడ్డాలో భరతమాత బిడ్డ విశ్వరూపం… దుమ్మురేపుతోన్న నాగచైతన్య తండేల్ గ్లింప్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు