Ram Charan: క్లీంకారతో ఎంజాయ్ చేస్తున్న చరణ్.. వైరలవుతున్న వీడియో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. మా మనసులు దోచేసిన వైజాగ్ బీచ్ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. By Archana 19 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవలే వైజాగ్ వెళ్లిన చరణ్.. .గత కొద్దీ రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే ఒక పక్క షూటింగ్ లో పాల్గొంటూనే.. మరో పక్క ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు మెగా హీరో. Also Read: Magadheera: చెర్రీ ఫ్యాన్స్ కు పూనకాలే .. మగధీర రీ రిలీజ్ డేట్ ఫిక్స్..! వైజాగ్ బీచ్ లో కూతురు క్లీంకారతో ఎంజాయ్ చేస్తున్న చరణ్ తాజాగా తన కూతురు క్లీంకార, భార్య ఉపాసనతో కలిసి వైజాగ్ బీచ్ లో సూర్యోదయాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన ముద్దుల కూతురు క్లీంకారకు చేపలు, సముద్రాన్ని చూపిస్తూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "మా మనసులు దోచేసిన వైజాగ్ బీచ్".. క్లీంకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్ పీరియన్స్ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో చూసిన మెగా అభిమానులు క్యూట్, సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నేటితో గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూట్ పూర్తి కానుంది. ఆ తర్వాత మార్చి 21 నుంచి హైదరాబాద్ లో మళ్ళీ కొత్త షెడ్యూల్ స్టార్ చేయనున్నట్లు సమాచారం. కాగా, గేమ్ ఛేంజర్ పూర్తయిన వెంటనే RC16 షూట్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ 'పెద్ది' అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) Also Read: Kumari Aunty: ఆ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను .. వైరలవుతున్న కుమారి ఆంటీ ఇంటర్వ్యూ ..! #ram-charan #vizag-beach #upasana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి