/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-02T134058.786-jpg.webp)
Ram Charan - Upasana : అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం(Wife & Husband Relation) చాలా ప్రత్యేకమైనది. దీన్ని వేరెవరూ రీప్లేస్ చేయలేరు. ఇందులో ఒకరె ఎక్కువ, మరొకరు తక్కువా అన్న భావనకు తావే లేదు. వయసుతో సంబంధం లేని బంధం ఏదైనీ ఉంది అంటే అది భార్యా భర్తల సంబంధం ఒక్కటే. ముద్దు పెట్టుకున్నా, నెత్తికెక్కించుకున్నా, కాళ్ళు పట్టుకునా.. ఏం చేసినా చెల్లుతుంది ఇక్కడ. ఆ విషయాన్నే చెబుతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan). తన భార్య ఉపాసన కాళ్ళకు మసాజ్ చేస్తున్నాడు.
Upasana Vadhina Be like : Evarra Global Star 😂❤️❤️#RamCharan @AlwaysRamCharanpic.twitter.com/HEucaODSnN
— Hemanth RC ™ (@Hemanth_RcCult) March 2, 2024
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు..
సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని... అని పాటలు పాడకపోయినా.. తన భార్యకు ఏం కావాలో తెలుసుకుని మరీ సేవలు చేస్తున్నాడు రామ్ చరణ్. ఉపాసన(Upasana) పాదాలను పట్టుకుని, కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తున్నాడు మన గ్లోబల్ స్టార్. జామ్‌నర్‌లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్(Anant Ambani Pre Wedding) కు వెళుతున్న సమయంలో ఇది జరిగింది. అనంత్ అంబానీ పెళ్లి కోసం ప్రత్యేకంగా విమానంలో వెళ్లారు రామ్ చరణ్ దంపతులు. ఈ వీడియోను రామ్‌చరణ్ ఫ్యాన్ ఇన్స్టాగ్రామ్(Instagram) లో పోస్ట్ చేశారు. దీనికి బోలెడన్ని లైకులు వస్తున్నాయి. అంతేకాదు అన్యోన్య దాంపత్యానికి వీరిద్దరూ నిదర్శనంగా నిలుస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఎంత గ్లోబల్ స్టార్ అయినా కూడా భార్యకు భర్తే కదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. రామ్ చరణ్ ఎంత డౌన్ టు ఎర్త్‌గా ఉంటాడు.. భార్యకు ఎంత విలువ ఇస్తాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Also Read : Telangana : హైదరాబాద్‌లో విషాదం..ముగ్గురిని మింగేసిన మ్యాన్‌హోల్