Ram Charan : తల్లి కోసం చెఫ్‌ గా మారిన మెగా పవర్‌ స్టార్‌!

మహిళా దినోత్సవం పురస్కరించుకుని మెగా పవర్ స్టార్‌ తన తల్లి, భార్య కోసం చెఫ్‌ గా మారారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.నా కోసం ఈరోజు నా కొడుకు వంట చేస్తున్నాడు అంటూ సురేఖ చెప్పుకొచ్చారు

Ram Charan : తల్లి కోసం చెఫ్‌ గా మారిన మెగా పవర్‌ స్టార్‌!
New Update

Ram Charan As A Chef : మహిళా దినోత్సవం(Women's Day) పురస్కరించుకుని మెగా పవర్ స్టార్‌(Mega Power Star) తన తల్లి, భార్య కోసం చెఫ్‌ గా మారారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోలో ముందు చిరంజీవి(Chiranjeevi) సతీమణి సురేఖ(Surekha) వంట గదిలో దోశలు వేస్తూ ఉంటారు. అప్పుడూ ఉపాసన.. అత్తమ్మ గారండీ ఈ రోజు మీ కిచెన్‌ లో ఏమవుతుంది? అంటూ ప్రశ్నించగా... ఏమవుతుంది.. దోశలు అవుతున్నాయంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.

ఆ పక్కనే చరణ్‌(Ram Charan) దోశలు తిప్పుతూ కనిపించారు. నా కోసం ఈరోజు నా కొడుకు వంట చేస్తున్నాడు అంటూ సురేఖ చెప్పుకొచ్చారు. దానికి ఉపాసన ఈరోజు ఉమెన్స్‌ డే కదా.. అయితే ప్రతిరోజూ ఉమెన్స్‌ డే అయితే చాలా బాగుంటుంది అంటూ నవ్వుతూ అన్నారు. తరువాత ఉపాసన చరణ్‌ గారు ఏం వండుతున్నారండీ అంటూ ఎంతో క్యూట్‌ గా చరణ్ ని అడిగితే ...దానికి సమాధానంగా చరణ్‌ మా అమ్మ కోసం పన్నీర్‌ టిక్కా(Paneer Tikka) తయారు చేస్తున్నానంటూ బదులిచ్చాడు.

ఈ సంభాషణతో ఉన్న వీడియోను ఉపాసన తన ఇన్‌ స్టాలో పోస్ట్ చేశారు. పోస్ట్‌ చేసిన కొన్ని నిమిషాల్లోనే కొన్ని వేల లైకులను వీడియో సొంతం చేసుకుంది. కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ వీడియో సొంతం అయ్యాయి. చరణ్‌ గరిటె పట్టడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా చరణ్‌ ఉపాసన కోసం ఫిష్‌ ప్రై(Fish Fry) చేసారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ఈ వీడియోను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అటు భార్య కోసం, తల్లి కోసం ఏదైనా చేసే పర్‌ఫెక్ట్ మ్యాన్‌ అంటూ కితాబులిచ్చేస్తున్నారు. చరణ్‌ వారం రోజుల క్రితం భార్య కాళ్లకు మర్థన చేస్తున్న వీడియో కూడా ఒకటి తెగ వైరల్‌ అయ్యింది. భార్యను , తల్లిని ఇంత ప్రేమగా చూసుకుంటే ఏ అమ్మాయి అయినా చరణ్‌ లాంటి వ్యక్తినే కోరుకుంటుంది మరి.

Also Read : ఎన్నికల షెడ్యూల్ అంటూ అసత్య ప్రచారం…క్లారిటీ ఇచ్చిన ఈసీ!

#chiranjeevi #upasana #ram-charan #surekha #womens-day #chef
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe