Ram Charan: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రామ్‌చరణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయబోతున్నారు. దీనికి ప్రధాని మోదీతో పాటూ పలువురు ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు. వీరిలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఒకరని తెలుస్తోంది.

Ram Charan: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రామ్‌చరణ్
New Update

Ram Charan Attending to Chandrababu oath ceremony: రామ్‌ చరణ్ ప్రస్తుంత సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితమే రామోజీరావు చనిపోవడంతో వాటికి బ్రేక్ పడింది. అదీ కాక చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో జరగబోతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ హాజరవుతారని తెలుస్తోంది. చంద్రబాబు క్యాబినెట్‌లో చరణ్ బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య వ్యక్తి.

2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి 164 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 12వ తేదీ ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ రాజకీయ పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గరలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్కులో సుమారు 11 ఎకరాలు స్థలంలో పెద్ద వేదికను నిర్మిస్తున్నారు.

Also Read:Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

#chandrababu #ram-charan #aoth-ceremony
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe