/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rakul-jpg.webp)
Rakul Preet Singh: గత కొంత కాలం వరకు కూడా టాలీవుడ్ లో రకుల్ కు పోటీ లేదు. ఆ తరువాత ఆమెకి అవకాశాలు బాగా తగ్గాయి. ఉన్నంత కాలంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలందరితో జత కట్టింది ఈ భామ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమెకి అవకాశాలు తగ్గినప్పటికీ ఆమెకున్న క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.
ఇప్పటికీ రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్ (Social Media) గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. రకుల్ ప్రీత్ ఎప్పుడూ కూడా గ్లామర్ గా కనిపించేందుకు కష్టపడుతూంటుంది. ఈ క్రమంలోనే త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అంటూ అభిమానుల గుండెల్లో బాంబు పేల్చింది.
View this post on Instagram
ఇంతకీ రకుల్ పెళ్లి చేసుకునేది ఎవర్నో కాదు బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani) ని. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారని రకుల్ తెలిపింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ ని ప్రకటించారు. ఈ నెలలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే రకుల్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుంది.
ఈ క్రమంలోనే రకుల్ థాయ్ లాండ్ లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో రకుల్ కి కాబోయే భర్త జాకీ భగ్నానీతో పాటు మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు. టాలీవుడ్ నుంచి ఈ పార్టీకి మంచు లక్ష్మి (Manchu Laxmi) , ప్రగ్యా జైస్వాల్ (Pragya jaiswal) హాజరయ్యారు. రకుల్ మంచు లక్ష్మి మంచి స్నేహితులన్న విషయం టాలీవుడ్ మొత్తానికి తెలిసిందే.
Also read: దాల్చిన చెక్కతో ఊబకాయానికి చెక్..వేలాడే కొవ్వు కూడా కరిగిపోతుంది!