డిసెంబర్ 12 అంటే సూపర్ స్టార్ రజినీ కాంత్(Rajinikanth) పుట్టినరోజు (Birthday). ఇప్పటికే కొద్ది రోజుల నుంచి రజినీ ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజుకు ఏర్పాట్లు చేయడంతో పాటు..సోషల్ మీడియాలో తెగ హంగామా చేసేస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో సినీ ప్రముఖులతో పాటు, అభిమానులు ఆయనకి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
రజినీ కాంత్ బర్త్ డేకి ఆయన మాజీ అల్లుడు ధనుష్ (Dhanush) కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియా (Social media)వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ధనుష్ రజినీ అల్లుడు కాక ముందు నుంచే రజినీకి విపరీతమైన అభిమాని. ఆయన చాలా సందర్భాల్లో , చాలా వేదికల మీద ఆయన్ని చూస్తు నటుడ్ని అయ్యాను అంటూ చాలా సందర్భాల్లో తెలియజేశారు.
రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ కి రజినీ అంటే ప్రాణం. అల్లుడిగా ఉన్నప్పుడు కూడా రజినీ కాంత్ , రజినీ సర్, తలైవా అనే పిలిచేవాడు. రజినీ సినిమా విడుదల అవుతుంది అంటే బెనిఫిట్ షోకే వెళ్లిపోయేవాడు. సినిమా చూసి వచ్చిన తరువాత కచ్చితంగా సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవాడు.
ఎన్నో సార్లు ఆయన రజినీ నాకు దేవుడితో సమానమని ఎన్నో వేదికల మీద చెప్పారు. ధనుష్ తన భార్య ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ కూడా ఏనాడు కూడా రజినీ గురించి ఒక్కసారి కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. రజినీకి, ధనుష్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఇప్పుడు ధనుష్ నుంచి హ్యాపీ బర్త్ డే తలైవా అని ట్వీట్ రాగానే రజినీ ఫ్యాన్స్ నెట్టింట్లో హంగామా చేయడం మొదలు పెట్టారు. ధనుష్ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.
రజినీకాంత్ 73 ఏళ్ళ వయసులోనూ తన ప్రత్యేకతను నిలుపుకుంటూ స్టార్గా దూసుకుపోతున్నాడు. రజనీకాంత్ ఏం చేసినా సంచలనమే. నవ్వులో వైవిధ్యం, నడకలో వేగం, గొంతులో గాంభీర్యం, మ్యానరిజంలో మాస్ అప్పియరెన్స్ అన్నీ కలిసి ఆయన్ని సూపర్ స్టార్‌ని చేశాయి. రజినీకాంత్ సిగరెట్ వెలిగించినా, సెల్యూట్ చేసినా…కోట్ వేసినా.. అదొక స్టైల్..అదొక స్పెషల్ మ్యానరిజం. అందుకే మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అతి కొద్ది నటుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు.
ప్రేక్షకుల్లో రజినీకాంత్‌కు అంత క్రేజ్ రావడానికి కారణం ఆయన స్టైయిల్. ఆయన నటించిన సినిమాలు అంత పాపులార్ కావడానికి కారణం కూడా ఇదే. సిగరెట్ వెలిగించే స్టైల్… సెల్యూట్ చేసే స్టైయిల్ ఆయన్ని మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ఇక రజినీకాంత్ స్టైల్, మేనరిజమ్ పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన చిత్రం ‘బాషా’. ఈ సినిమాలో ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే డైలాగ్స్ ఇప్పటికి ప్రేక్షకులు మరిచిపోలేదు.
బాషా మూవీతో రజినీకాంత్..తెలుగులో ఇక్కడి స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. దీని తర్వాత రజనీ చేసిన ఒక్కో సినిమా ఒక్కో మాస్టర్ పీస్. దళపతి, ముత్తు, పెదరాయుడు, చంద్రముఖి, శివాజీ, రోబో ఇలా అన్ని సినిమాలూ. పైగా ఇలాంటి సినిమాలు చేస్తే రజనీనే చేయాలి అన్నట్టు కూడా ఉంటాయి.
తమిళ్‌లో ఆరు సార్లు ఉత్తమ నటుడి అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, కేంద్రం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. రజినీకాంత్‌లో ఆధ్మాత్మిక భావాలు కూడా ఎక్కువ. ఖాళీ సమయాల్లో హిమాలయాకు వెళుతూ సేద తీరుతూ ఉంటారు. ఏడాది ఒక్క సినిమానే చేస్తారు రజనీకాంత్..కానీ అది ఎప్పటికీ నిలిచిపోయేలా…ప్రేక్షకులకు గుర్తింపోయేలా చేస్తారు. అదీ ఆయన ప్రత్యేకత.
Also read: మళ్లీ తెలంగాణలోకి ఆమ్రపాలి ఐఏఎస్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్?