Tamil Heros: కోలీవుడ్‌కు రజినీ కాంత్ విజయ్, అజిత్ లు మూల స్థంభాలు. దశాబ్దాలుగా వీరు ముగ్గురూ మాస్ లో అతిపెద్ద క్రౌడ్-పుల్లర్ లుగా ఉన్నారు. అందుకే వీరికి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చి సినిమాలు చేయడానికి రెడీగా ఉంటారు నిర్మాతలు. ఈ హీరోల యావేజ్ హిట్‌లు కూడా కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. దీంతో వీరికి రెమ్యునరేషన్‌తో పాటూ లాభాల్లో వాటాలు కూడా దక్కుతాయని చెబుతారు. అ లెక్కన రజినీ, అజిత్, విజయ్ ముగుగరి నెక్ట్స్ సినిమాల పాతితోషకాలను మొత్తంగా కలిపి చూస్తే, ఏకంగా రూ.400 కోట్ల మైలురాయిని దాటింది.
ఇండియాలో 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే తారలు డజనుకు పైగానే ఉన్నారు. ఆ జాబితాలో తమిళ స్టార్ హీరోల పేర్లు ఉన్నాయి. వారిలో రజినీ కాంత్, విజయ్, అజిత్‌లు మెయిన్. బాక్సాఫీస్ వసూళ్లు సహా ప్రీ-రిలీజ్ వ్యాపార ఒప్పందాలతో రిటర్న్‌లు తీసుకురాగల సత్తా ఉన్న హీరోలుగా ఈ ముగ్గురు హీరోలు ఎప్పుడూ ఉంటారు. అందుకే వారిపై పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం గురించి నిర్మాతలు పెద్దగా ఆలోచించరు. దానిని ఒత్తిడిగా భావించరు.
తాజాగా కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ సక్సెస్ తర్వాత తన పారితోషికాన్ని అమాంతం పెంచారు. ఈయన తర్వాత సినిమా కూలీలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే టైటిల్ ని ఆవిష్కరించగా దీనికి అద్భుత స్పందన వచ్చింది. దీనికి ముందే రజనీ వెట్టయన్`లో కనిపిస్తారు. ఈ చిత్రం నిజంగా ప్రత్యేకమైనది. ఇందులో రజనీ- అమితాబ్ బచ్చన్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి కలిసి పని చేస్తున్నారు. వెట్టయిన్ సినిమాకు సూపర్ స్టార్ రజనీ కాంత్ తన పారితోషికంగా 140-150 కోట్లు తీసుకుంటున్నట్లు పుకారు ఉంది. ఇక లోకేష్ కనగరాజ్ తో సినిమా కు అయితే ఏకంగా రజనీ పారితోషికం రేంజ్ 250-260 కోట్లకు చేరుకుందన్న గుసగుస వినిపిస్తోంది. ఇది కాకుండా లాభాల్లో వాటాలు కూడా అందనున్నాయని తెలుస్తోంది. ఓవరాల్ గా రజనీకాంత్ రెవెన్యూ ఈ ఒక్క ప్రాజెక్ట్ నుంచి 250 కోట్లు పైగా అందనుందని టాక్.
ఇక దళపతి విజయ్ తరువాత సినిమా ది గోట్. ఈ మూవీ విజయ్‌కు లాస్ట్ బట్ నాట్ వన్ మూవీ. రాజకీయాల్లోకి రాకముందు రెండు సినిమాలు మాత్రమే చేస్తాడని అందులో ఇదొకటని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే బోలెడంత బజ్ క్రియేట్ కూడా అయింది. దీంతో ది గోట్ సినిమాకు ఆయన అందుకుంటున్న పారితోషకం అమాంతంగా పెరిగి 200 కోట్లు అయిందని చెబుతున్నారు. ఇక అజిత్ విషయానికి వస్తే తాజాగా తన 63వ సినిమా పేరు గుడ్ బ్యాడ్ అగ్లీ అని అనౌన్స్ చేశారు. దీనికి ముందు విదా ముయార్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్‌లో టాక్ ప్రకారం ఈ రెండు సినిమాల్లో ఒకదానికి 110-120 కోట్లు, ఇంకొక దానికి 450-470 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని చెబుతున్నారు.
Also Read:Bihar: బీహార్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి