2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున ఇండియా టీవీలో జరిగిన చర్చ వివాదాలకు దారి తీస్తోంది. ఆ సమయంలో చర్చ జరుగుతున్నప్పుడు యాంకర్ రజత్ శర్మ తమపట్ల అసభ్యపదజాలం ఉపయోగించారని కాంగ్రెస్ నేత రాగిణీ నాయక్ ఆరోపించారు. మరో ఇద్దరు నేతలు జైరామ్ రమేష్, పవన్ ఖేరాలు కూడా ఈ విషయాన్ని సమర్ధించారు. దీనిపై రజత్ శర్మ కూడా రివర్స్ కేసు వేశారు. కాంగ్రెస్ నేతలే తనపై అసభ్యపదజాలం వాడారని...తనకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారని..రజత్ శర్మ వారిపై పరువు నష్టం దావా వేశారు. ఈట్వీట్లు తొలగించాలని, రాజకీయ నేతలు తనపై ఆరోపణలు చేయకుండా నిరోధించాలని రజత్ శర్మ కోర్టులో విన్నవించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4 సాయంత్రం ఛానల్‌లో చర్చ జరుగుతుండగా... ట్వీట్లు చేయడం ప్రారంభించారని శర్మ తరఫు న్యాయవాది చెప్పారు.దీనికి సంబంధించి వీడియోలు, ఆధారాలను కోర్టులో సమర్పించారు రజత్ శర్మ తరుఫు న్యాయవాది.
అయితే లైవ్ షో ముగిసిన ఆరు రోజుల తర్వాతనే రజత్‌శర్మపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారని.. జూన్ 11న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు కాంగ్రెస్ తరుఫు సీనియర్ న్యాయవాది. జూన్ 4న ఎలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడలేదని అన్నారు ఇవి కావాలని చేస్తున్న ఆరోపణలని వాదించారు. రజత్ శర్మ లేనివాటిని సృష్టించి మరీ ఆరోపిస్తున్నారని అన్నారు.
అయితే జర్నలిస్ట్‌గా తాను నలభై ఏళ్ళుగా గౌరవంగా బతుకుతున్నానని...ఇప్పుడు ఈ ట్వీట్ల వల్ల తాన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోందని రజత్ శర్మ అంటున్నారు. కాబట్టి వెంటనే ఆ ట్వీట్లను తొలగించాలని కోరారు. దీనికి సంబంధించి ఆదేశాలను కోర్టు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేశారు.
Also Read:Sulthanabad: కఠినంగా శిక్షించండి.. ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సీరియస్!