Ashok Gehlot: నెల రోజుల్లో రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కరెక్ట్ గా ఇప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్సరా (Govind Singh Dotasra) సహా మరి కొందరు నేతల ఇళ్ళల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ (Ashok Gehlot) కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో భాగంగా రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్సరా ఇంట్లో సోదాలు నిర్వహించింది. Foreign Exchange Management Act నిబంధనల్ని ఉల్లంఘించినందుకు అశోక్ గహ్లోట్ కొడుకు వైభవ్‌కి (Vaibhav Gehlot) సమన్లు ఇచ్చింది. నవంబర్ 25న రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు కేసులూ రాజకీయాల్ని వేడెక్కించాయి. వైభవ్ ప్రస్తుతం AICC సభ్యుడిగానే కాకుండా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈతనిని అక్టోబర్ 27న జైపూర్‌లో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. తాము అధికారంలోకి రామని బీజేపీకి అర్థమైందని, అందుకే ఈడీ దాడులు చేయిస్తోందని మండి పడుతోంది కాంగ్రెస్.
Also Read:రెండో పెళ్ళికి సిద్ధమైన హీరోయిన్..బర్త్ డే రోజు ప్రపోజల్
ఈడీ (ED) సోదాల మీద ఢిల్లీలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ప్రజలకు నమ్మకం పోయింది. బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా భీభత్సం సృష్టిస్తోంది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ఇంట్లో సోదాలు నిర్వహించారని అశోక్ మండిపడ్డారు. కేవలం రాజకీయంగా దెబ్బ కొట్టడానికే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇక తన కుమారుడికి ఇచ్చిన నోటీసులపై స్పందిస్తూ...ఇదంతా ఒక జోక్ లా ఉంది. నోటీసులు ఇచ్చిన మర్నాడే విచారణకు రమ్మంటున్నారు అంటూ విమర్శించారు. తామేమీ భయపడడం లేదని...బీజెపీకి వ్యతిరేకంగా ఉన్నవారు ఈడీ విచారణను ఎదర్కోవడం కొత్తేమీ కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 25 మహిళలకు హామీలిస్తే...ఆ మర్నాడే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఇంట్లో సోదాలు జరిగాయి. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ధర 500 చేస్తామని, మహిళలకు ఏడాదికి 10 వేలు గౌరవ భృతి ఇస్తామని చెప్పాము. మహిళలు బాగుపడడం బీజజేపీకి ఇష్టం లేదు. అందుకే తమను అడ్డుకుంటోంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఈడీ దాడులను తీవ్రంగా ఖండించారు. రాజస్థాన్ లో ఓటమి తప్పదనే భయంతోనే బీజేపీ ఈడీని ప్రయోగిస్తోందని ఆయన ఆరోపించారు.