/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ss-1-jpg.webp)
SS Rajamouli Dance : ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli) ... ఎప్పుడు తన పని తాను చూసుకోవడమే తప్పా...పెద్దగా ఫంక్షన్స్ లో కూడా మాట్లాడని డైరెక్టర్ (Director). ఏదైనా సినిమా అనుకుంటే దానిలో ఇసుమంతన్న వేలెత్తి చూపకుండా చూసుకుంటాడు. తన సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ లో మాత్రం తన మాటల గారడీతో అభిమానులను తన వైపునకు తిప్పుకుంటాడు.
ఏ కార్యక్రమానికి వెళ్లినా రాజమౌళి తన భార్య రమ(Rama) ను కచ్చితంగా తీసుకుని వెళ్తాడు. ప్రతి సందర్భంలో కూడా భార్య గురించి చాలా గొప్పగా చెబుతుంటాడు కూడా. తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్(Family Function) కు తన భార్య రమతో కలిసి వెళ్లిన ఆయన అక్కడ ప్రేమికుడు సినిమాలోని ''అందమైన ప్రేమరాణి ఉత్తరాలకే అనే పాటకు స్టేజీ మీద డ్యాన్స్ చేసి ఓ ఊపు ఊపాడు.
#SSrajamouli Dance #viralvideo #RRR #RRRMovie #TeluguNews #TeluguCinema #telugustatus pic.twitter.com/aiTUL8lzwI
— srk (@srk9484) March 31, 2024
ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా రాజమౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ భార్యతో కలిసి జక్కన్న చేసిన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Also Read : తిరుమలలో ‘పారిజాత పర్వం’ మూవీ టీమ్.. వైరలవుతున్న ఫొటోలు