Telangana Rains: తెలంగాణలో ఐదు రోజులు వానలే..వానలు!

గత మూడు రోజుల నుంచి హైదరాబాద్‌ (Hydearabad)  నగరాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు. నిమిషం కూడా గ్యాప్‌ లేకుండా కుమ్మేస్తుంది.

New Update
Weather : తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. చల్లబడనున్న వాతావరణం

Telangana Rains: గత మూడు రోజుల నుంచి హైదరాబాద్‌ (Hydearabad)  నగరాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు. నిమిషం కూడా గ్యాప్‌ లేకుండా కుమ్మేస్తుంది. మంగళవారం రాత్రి నుంచి కొంచెం తెరిపించినప్పటికీ మళ్లీ నగరాన్ని మబ్బులు కమ్మేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఐఎండీ వారు మరో హెచ్చరిక జారీ చేశారు. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వీటి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.

సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 7వ తేదీ వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ఈ వర్షాకాలంలో సుమారు 20 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం 723.1 మి.మీ వర్షపాతం నమోదు అయ్యిందని వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలో వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నాలుగేళ్ల బాలుడు నాలా పడి మృతి చెందాడు. మూసీ నది ప్రవాహాం తీవ్రంగా ఉండటంతో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం బుధవారం కొట్టుకుని వచ్చింది.

Also Read: ఇద్దరమ్మాయిలు సూసైడ్‌.. ప్రాణం తీసిన మార్ఫింగ్‌ ఫొటోలు

Advertisment
తాజా కథనాలు