Hyderabad: మిచౌంగ్‌ ఎఫెక్ట్‌..హైదరాబాద్ లో మొదలైన వాన!

మిచౌంగ్‌ ఎఫెక్ట్‌ తెలంగాణ మీద చూపిస్తుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖాధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

New Update
Hyderabad: మిచౌంగ్‌ ఎఫెక్ట్‌..హైదరాబాద్ లో మొదలైన వాన!

ఏపీ కోస్తా తీర ప్రాంతాన్ని అనుకుని నెల్లూరు నుంచి మచిలీపట్నం వైపు సాగుతున్న మిచౌంగ్‌ తుఫాన్‌ మరి కొన్ని గంటల్లో తీరం దాటనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. బాపట్ల-దివిసీమ మధ్య ఈ తుఫాన్‌ తీరం దాటుంతుందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద కూడా చూపుతుంది. అందువల్ల హైదరాబాద్‌ లో కూడా జోరున వర్షం కురుస్తోంది

రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే నగరంలోని హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్, బోయినపల్లి, బేగంపేట్‌, బాలానగర్‌, కూకట్‌పల్లి, కొండాపూర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మెహదీపట్నం, ఖైరతాబాద్‌, నాంపల్లి, కోఠి, చాంద్రాయణగుట్ట, హిమాయత్‌నగర్‌, అంబర్‌పేట, మల్కాజిగిరిలో వాన పడుతోంది.

అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

బుధవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగ్‌, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరంజ్‌అలర్ట్‌ ప్రకటించింది. వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది.

భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది.

Also read: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌…గ్రామ సచివాలయాల్లో 1896 ఉద్యోగాలు!

Advertisment
తాజా కథనాలు