Michaung Cyclone: ఏపీలో తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్.. తెలంగాణకు హెచ్చరిక

ఏపీలో కొనసాగుతున్న మిచౌంగ్ తుపాన్ మరికొన్ని గంటల్లో బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.

New Update
Michaung Cyclone: ఏపీలో తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్.. తెలంగాణకు హెచ్చరిక

ఏపీలోని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిచౌంగ్ తుపాను మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, అమీర్‌పేట్, పంజాగట్ట, మెహిదీపట్నం, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.ఇక రాష్ట్రంలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Also Read: మిచౌంగ్ ప్రభావంతో జలదిగ్బంధంలో చెన్నై మహా నగరం..!!

భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. అలాగే సూర్యపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కరుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ ప్రకటించింది. అలాగే వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటిక నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది. అలాగే ఈ తుపాను ధాటికి తమిళనాడులో చైన్నైలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.

Also Read: అక్కడ బీఆర్‌ఎస్‌ ఒక్కసారీ గెలవలేదు!

Advertisment
తాజా కథనాలు