Weather Alert: రాగల మూడు రోజులు వానలే వానలు..

బంగాళఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రేపు ఉదయానికి ఇది తుపానుగా మారనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో మే 27 వరకు ఉత్తర, బెంగాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
Weather Alert: రాగల మూడు రోజులు వానలే వానలు..

బంగాళఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రేపు ఉదయానికి ఇది తుపానుగా మారనున్నట్లు వాతవారణ శాఖ తెలిపింది. ఈ తుపాన్‌కు రెమాల్‌గా నామకరణం చేశారు. రేపు బంగ్లాదేశ్, బెంగాల్ తీరాన్ని తుపాను తాకనుంది. ఈనెల 26 రాత్రి వరకు ఈ తీవ్ర తుపాను కొనసాగనుంది. దీని ప్రభావంతో ఉత్తర, బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Also Read: దూరదర్శన్‌లోకి వచ్చేస్తున్న ఏఐ యాంకర్లు..

అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఏపీకి, అలాగే తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నేటి నుంచి 27 వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదిలాఉండగా.. మరోవైపు నైరుతి రతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నెల 28,29 తేదీల్లో కేరళను తాకే అవకాశం ఉంది. జూన్ 3,4 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ప్రభావంతో కేరళ, తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బలపడితే నైరుతి రుతుపవనాలపై ప్రభావం ఏర్పడనుంది. శ్రీలంకలో కూడా రుతుపవనాలు విస్తరించనున్నాయి.

Also Read: హెలికాప్టర్‌లో సాంకేతికలోపం.. తప్పిన ప్రమాదం

Advertisment
తాజా కథనాలు