Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన!

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది.భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు!
New Update

Heavy Rain Alert: దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ తో పాటు ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో (Telangana) మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది.

భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఈ మేరకు ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. మధ్యాహ్నం కాస్త ఎండ వచ్చినప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది.

Also Read: సెబీ ఛైర్‌పర్సన్‌ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు : రాహుల్

#telangana #rains #hyderabad #adilabad #heavy-rain-alert
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe