Telangana: మరో మూడురోజులు వర్షాలే.. ఆ జిల్లాలకు అలెర్ట్

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం మెదక్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం మెదక్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Also Read: కొరడా ఝళిపిస్తోన్న హైడ్రా.. మీ ఆస్తులు సేఫేనా ? ఇలా చెక్ చేసుకోండి

ఇక బుధవారం, గురువారం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 24న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ మీదుగా కొనసాగిన ఆవర్తనం, ద్రోణి మంగళవారం బలహీనపడ్డాయని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Also Read: మేఘాపై రేవంత్‌కు ఎందుకంత ప్రేమ.. ఆనాడు దుమ్మెత్తిపోసింది మరిచిపోయావా!

Advertisment
తాజా కథనాలు