Telangana: రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు!

పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

AP Heavy Rains : నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అవసరమైతేనే బయటకు రండి!
New Update

Heavy Rains in Telangana: పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ ఆవర్తనం గ్యాంగ్​టక్ పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా వద్ద సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు సమాచారం.

ఈ ప్రభావంతో గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్​నగర్‌, వనపర్తి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.

Also Read: అనర్హత మీద స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టుకు వినేశ్

#telangana #rains #hyderabad #imd #heavy-rains-in-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe