Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్ క్యాన్సిల్ అయితే తక్కువ ఫీజు

రైలులో ఆర్‌ఏసీ టికెట్‌ బుక్‌ చేసినప్పుడు.. అది కన్ఫామ్ కాకుండా క్యాన్సల్ అయిపోతే సర్వీస్‌ ఛార్జ్ కింద రైల్వేశాఖ ఎక్కువగా వసూలు చేస్తోంది. అయితే తాజాగా భారత రైల్వే శాఖ.. రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇకనుంచి సర్వీస్ ఛార్జీలు కేవలం రూ.60 మాత్రమే వసూలు చేయనుంది.

New Update
Indian Railways: ఈరోజు విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు స్పెషల్ ట్రైన్..

Ticket Cancel : రైలు ప్రయాణం కోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్‌సైట్ నుంచి  ఆర్‌ఏసీ(RAC) టికెట్‌ బుక్‌ చేసినప్పుడు.. అది కన్ఫామ్ కాకుండా క్యాన్సల్ అయిపోతే సర్వీస్‌ ఛార్జ్ కింద రైల్వేశాఖ ఎక్కువగా వసూలు చేస్తోంది.  తాజాగా భారత రైల్వే శాఖ.. రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇకనుంచి సర్వీస్ ఛార్జీలు కేవలం రూ.60 మాత్రమే వసూలు చేయనుంది. అయితే ఏప్రిల్ 12న సునీల్ కుమార్ ఖందేల్వాల్ అనే రైట్‌ టూ ఇన్‌ఫర్మేషన్(RTI) యాక్టివిస్ట్‌.. టికెట్‌ క్యాన్సిల్‌ అయినప్పుడు రైల్వేశాఖ అధిక ఛార్జీలు వసూలు చేయడంపై.. రైల్వే అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేశారు.

Also Read: రాష్ట్రంలో పాఠశాలలకు నేటి నుంచి సమ్మర్ హాలిడేస్..

ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్‌సైట్‌లో వెయిటింగ్ టికెట్స్ బుక్ చేసినప్పుడు అవి కన్ఫామ్ కాకపోతే.. రైల్వేశాఖ ఆ టికెట్స్‌ను క్యాన్సిల్ చేస్తుందని.. అలాగే పెద్ద మొత్తంలో సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తుందని ఆయన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఉదాహరణకు రూ.190కు ఒక వెయిటింగ్ లేదా ఆర్‌ఏసీ టికెట్‌ను బుక్‌ చేస్తే.. అది ఒక వేళ కన్ఫామ్ కాకపోతే.. రైల్వేశాఖ కేవలం రూ.95 మాత్రమే రిఫండ్ చేస్తుంది. మిగిలిన డబ్బంతా సర్వీస్ ఛార్జ్ కింద కట్ చేసుకుంటుందని తెలిపారు.

అయితే సునీల్ కుమార్ ఖందేల్వాల్ చేసిన ఫిర్యాదుపై ఐఆర్‌సీటీసీ(IRCTC) మేనేజింగ్ డైరెక్టర్ స్పందించారు. టికెట్ బుకింగ్స్, రిఫండ్స్‌కు సంబంధించిన విధానాలు భారత రైల్వేశాఖకు సంబంధించినవని తెలిపారు. రైల్వేశాఖ నిర్ణయాల మేరకే ఐఆర్‌సీటీసీ(IRCTC) వాటిని అనుసరిస్తుందని పేర్కొన్నారు. రైల్వే రూల్స్ ప్రకారం వెయిట్‌లిస్టిడ్‌ లేదా ఆర్‌ఏసీ టికెట్‌లకు సంబంధించి.. రైల్వే నిబంధనల ప్రకారం టికెట్‌ క్యాన్సిల్‌కు రూ.60 సర్వీస్ ఛార్జీ ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని రైల్వే అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకొచ్చినందుకు ఐఆర్‌సీటీసీ(IRCTC) ఎండీ సునీల్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: సంపద పునఃపంపిణీ మీద శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు