Summer Vacations : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చిన అధికారులు తాజాగా మరికొన్ని రైళ్లను తీసుకొచ్చారు. సికింద్రాబాద్ నుంచి బెంగాల్‌లోని సాంత్రాగాఛి, షాలిమార్‌కు ప్రత్యేక రైళ్ల(Special Trains) ను నడుపుతున్నారు. అలాగే కేరళలోని కొల్లంకు సర్వీసులు నడపనున్నారు. సికింద్రాబాద్- సాంత్రాగాఛి (07223) రైలు శుక్రవారం బయల్దేరనుంది. జూన్ 28 వరకు ఈ సర్వీస్ నడుస్తుందని అధికారులు అంటున్నారు. సాంత్రాగాఛి - సికింద్రాబాద్ (07224) రైలు జూన్ 29 వరకూ అందుబాటులో ఉంటుంది. నల్గొండ, మిర్యాలగూడలో ఈ రైళ్లు ఆగుతాయని అధికారులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: వేసవిలో త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఉదయం ఈ నీళ్లు తాగండి
గుంటూరు, విజయవాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్ మీదుగా ఈ రైళ్లు వెళ్తాయని చెబుతున్నారు. సికింద్రాబాద్-షాలిమార్ (07225) ప్రత్యేక రైలు జూన్ 24 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉండనుంది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మంలో ఆగనున్నాయి. రాయనపాడు, రాజమండ్రి, భువనేశ్వర్, సాంత్రాగాచి మీదుగా వెళ్లనున్నాయని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్-కొల్లం మధ్య 22 ట్రిప్పులు రైళ్లు నడుపుతున్నారు. సికింద్రాబాద్-కొల్లం (07193) రైలు ఏప్రిల్ 24, మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడవనుంది. అలాగే తిరుపతి-మచిలీపట్నం మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి ఏప్రిల్ 24.. మే 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. తిరుపతి నుంచి ఏప్రిల్ 21, 28.. మే 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10:20 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7:30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటాయి.
ఇది కూడా చదవండి: తిరుమలలో వసంతోత్సవ శోభ..ఆ సేవలను రద్దు చేసిన టీటీడీ