Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు (Bharat Jodo Nyay Yatra) బ్రేక్ పడిదింది. మూడు రోజుల పాటు తాత్కాలికంగా విరామం ఇచ్చారు రాహుల్. అస్సాంలో యాత్ర ముగించుకున్న రాహుల్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) కూచ్‌బెహర్ జిల్లాలో యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే.. బెంగాల్ కొనసాగుతున్న యాత్రకు విరామం ప్రకటించి అక్కడి నుంచి హుటాహుటిన ఢిల్లీకి (Delhi) వెళ్లారు.
ALSO READ: రైతు బంధు ఇప్పట్లో లేనట్లే.. రేవంత్ షాకింగ్ ప్రకటన
నితీష్ దూరమా?..
రాజకీయ అంశాల చర్చ కోసం కాంగ్రెస్ హైకమాండ్ (Congress Party) నుంచి రాహుల్ గాంధీకి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ యాత్రకు బ్రేక్ పడడానికి ప్రధాన కారణం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా వెళతామని చెప్పడమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఇండియా కూటమిలో భాగంగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ (CM Nitish Kumar) కూడా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ తో కలిసి ప్రయాణించాలని సీఎం నితీష్ కుమార్ భావిస్తున్నట్లు తెలిపాయి. దీనిపై ఇంకా ఎక్కడ సీఎం నితీష్ కుమార్ ఏమి మాట్లాడలేదు. వస్తున్న వార్తలను సీఎం నితీష్ కుమార్ ఖండిస్తారా? లేదా బీజేపీతో కలిసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనేది దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సీఐడీకి బదిలీ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన రోజున రాహుల్ గాంధీ అస్సాంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసును పోలీసులు సీఐడీ (CID)కి తరలించారు. దీనిపై విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగిస్తున్నామని రాష్ట్ర డీజీ వెల్లడించారు.
ALSO READ: మాజీ సీఎం కేసీఆర్‌కు షాక్!
DO WATCH: