Rahul Gandhi:మేడిగడ్డ బ్యారేజిని సందర్శించిన రాహుల్ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కొంత సేపటి క్రితం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. వంతెన మీద పగుళ్ళు చాలా ఎక్కువ అయ్యాయని...కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో అవినీతి విపరీతంగా జరిగిందని ఆయన మండిపడ్డారు. By Manogna alamuru 02 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కేసీఆర్ ఆయన ఫ్యామిలీ తెలంగాణను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎమ్ లా వాడుకున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈరోజు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన ఆయన ఎక్కడెక్కడో పగుళ్ళు వచ్చాయో, బ్రిడ్జి కుంగిపోయిందో స్వయంగా చూసి తెలుసుకున్నారు. చాలా పిల్లర్లకు పగుళ్ళు వచ్చాయని...అవినీతి మొత్తం అక్కడే కనిపిస్తోందని రాహుల్ మండిపడ్డారు. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత నాసిరకమైన ప్రాజెక్టను నిర్మించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. Kaleshwaram Project = KCR Family ATM I visited the Medigadda barrage, which is a part of the corruption-ridden Kaleshwaram Lift Irrigation Scheme in Telangana. Cracks have developed in multiple pillars because of shoddy construction with reports indicating that the pillars are… pic.twitter.com/BWe8Td9mCq — Rahul Gandhi (@RahulGandhi) November 2, 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళారు. మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించారు. మేడిగడ్డలో రాహుల్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇక్కడి నుంచి అంబటిపల్లి కొత్త గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను మహిళలకు వివరిస్తారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను శ్రీధర్ బాబు దగ్గర ఉండి చూసుకుంటున్నారు. Also Read:కాంగ్రెస్ లో జంప్ అయిన వివేక్.. మరి బీజేపీ మేనిఫెస్టో సంగతేంటి? మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించిన తర్వాత రాహుల్ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఘటన రాజకీయ పరంగా ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవడం బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోంది కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. Also Read:ఫైబర్ గ్రిడ్ కేసులో దూకుడు పెంచిన సీఐడీ #congress #telangana #rahul-gandhi #medigadda #barrage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి