National : గుజరాత్‌లోనూ బీజేపీని ఓడిస్తాం -రాహుల్‌ గాంధీ

అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్‌లో కూడా ఓడిస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు.

New Update
National : గుజరాత్‌లోనూ బీజేపీని ఓడిస్తాం -రాహుల్‌ గాంధీ

National Congress : నేషనల్ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుజరాత్ (Gujarat) లో పర్యటించారు. అక్కడ రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌ అగ్ని ప్రమాద బాధితులను పరామ్శించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో మాదిరిగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనకు దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని మోదీ అన్నారని, అలాంటప్పుడు అయోధ్యలో బీజేపీ (BJP) సభ్యులు జూలై 2న అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణను రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. మమ్మల్ని బెదిరించి, మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ద్వారా వాళ్లు (బీజేపీ) సవాల్ విసిరారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లుగా మేమంతా కలిసి వారి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నాం. రాత పూర్వకంగా తీసుకోండి. అయోధ్యలో చేసినట్లే గుజరాత్‌లోనూ నరేంద్ర మోదీ (Narendra Modi) ని, బీజేపీని ఓడిస్తామని రాహుల్ అన్నారు. గుజరాత్‌ నుంచే కొత్త ప్రారంభాన్ని కాంగ్రెస్‌ ప్రారంభిస్తుందని తెలిపారు.

మరోవైపు రాహుల్ గాంధీ జూలై 8న మణిపూర్‌లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు కన్ఫామ్ చేశాయి. మణిపూర్ ఉద్రిక్తతల తర్వాత రాహుల్ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. ఎన్నికల ముందు పర్యటను అనుమతినివ్వకపోవడంతో అప్పుడు కాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ తన పర్యటనలో సహాయ శిబిరాలను సందర్శించి.. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులతో రాహుల్ చర్చలు జరపనున్నారు. రీసెంట్‌గా రాజ్యసభలో మోదీ మణిపూర్ గురించి ప్రస్తాించారు. అక్కడ సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది.

Also Read:Karnataka: వీడేం డాక్టర్..శిశువు జననాంగాలు కత్తిరించేశాడు ఏకంగా..

Advertisment
Advertisment
తాజా కథనాలు