Rahul Gandhi: రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్‌.. వదులుకోబోయే సీటు ఇదే

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో వయనాడ్‌, యూపీలో రాయ్‌బరేలి స్థానాల్లో గెలవడంతో.. వయనాడ్‌ సీటును వదులకోనున్నట్లు తెలుస్తోంది. వయనాడ్‌లో ప్రియాంక గాంధీని కాకుండా కాంగ్రెస్ సీనియర్‌ నేతను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

New Update
Rahul Gandhi: రాహుల్ గాంధీపై హైకోర్టులో పిటిషన్

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. రెండు స్థానాల్లో గెలవడంతో.. రాహుల్ ఒక సీటు వదుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వయనాడ్‌ సీటును వదిలేయనున్నట్లు తెలుస్తోంది. రాయ్‌బరేలీ ఎంపీ హోదాలోనే కొనసాగాలని రాహుల్‌ నిర్ణయించుకున్నట్లు యూపీ కాంగ్రెస్ కమిటీ పేర్కొంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉందని తెలిపింది. ముందుగా వయనాడ్‌లోనే ఉండాలని కేరళ కాంగ్రెస్ కోరినప్పటికీ.. ఆ తర్వాత యూపీ కాంగ్రెస్ అభ్యర్థన మేరకు వారు వెనక్కి తగ్గారు.

Also Read: కాంగ్రెస్ తో పొత్తు లేదు..ఆప్‌ కీలక ప్రకటన!

శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే వయనాడ్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీని పోటీచేయాలన్న అభ్యర్థనను గాంధీ ఫ్యామిలీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతను వయనాడ్‌ నుంచి బరిలోకి దింపాలని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: ఈ ఏడాది నీట్‌ కటాఫ్‌ పెరుగుతుందా? నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ వివరణ!

Advertisment
Advertisment
తాజా కథనాలు