Congress-AAP : కాంగ్రెస్ తో పొత్తు లేదు..ఆప్ కీలక ప్రకటన! వచ్చే సంవత్సరం జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తు అనేది కేవలం లోక్ సభ ఎన్నికలకు మాత్రమేనని ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. By Bhavana 06 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Congress : వచ్చే సంవత్సరం జరగనున్న ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తు అనేది కేవలం లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) మాత్రమేనని ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలతో గురువారం భేటీ నిర్వహించిన అనంతరం రాయ్ ఈ విషయం గురించి ప్రకటించారు. లోక్సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి (INDIA Alliance) ఏర్పడిందని తొలిరోజే స్పష్టం చేశామని ఈ సందర్భంగా గోపాల్ రాయ్ అన్నారు. ఆప్ తన సంపూర్ణ బలంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని అన్నారు. కాగా 2025 మొదట్లోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ఆప్ పార్టీ ఇండియా కూటమిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలు ఉండగా పొత్తులో భాగంగా నాలుగు సీట్లలో ఆప్, మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేశాయి. అయితే అనూహ్య రీతిలో ఈ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్, ఆప్ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. Also read: రాష్ట్ర ప్రజలకు కృతజ్ఙతలు తెలిపిన జన సేనాని! #congress #delhi-assembly-elections #lok-sabha-elections #aap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి