Mood of the nation: INDIA కూటమిని నడిపించేది ఎవరో తేల్చేసిన 'ఇండియా టూడే'! ఎవరంటే?

జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్‌ ఓ రేంజ్‌లో పెరిగిందని 'ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్' తేల్చింది. 'INDIA' కూటమిని ముందుండి నడిపించేది రాహులేనని సర్వే చెబుతోంది. 24శాతం మంది రాహుల్‌ 'INDIA' కూటమి లీడ్ చేస్తాడని అభిప్రాయపడగా.. చెరో 15శాతం మంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత నాయకత్వం వహిస్తారని తెలిపారు.

New Update
Mood of the nation: INDIA కూటమిని నడిపించేది ఎవరో తేల్చేసిన 'ఇండియా టూడే'! ఎవరంటే?

Mood of the nation: 'INDIA' కూటమిని ఎవరు లీడ్ చేస్తారు..? 'NDA' కూటమి లీడర్‌ ఎవరంటే ప్రతిఒక్కరూ మోదీనే చూపిస్తారు.. వేరే ఆలోచన కూడా చేయరు..ఇక 'INDIA' కూటమిని ముందుండి ఎవరు నడిపిస్తారని అడిగితే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెబుతారు. మరి 'ఇండియా టుడే' సీ ఓటర్
సర్వే ఏం చెబుతోంది..? రాహుల్ గాంధీ, మమత, కేజ్రీవాల్‌లో అందరికంటే ముందు ఎవరున్నారు.?


వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ(NDA)తో తలపడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న వేళ.. 'INDIA' కూటమికి నాయకత్వం వహించేందుకు రాహుల్ గాంధీ ఫస్ట్ ఛాయిస్‌ అని 'ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్' చెబుతోంది. ప్24 శాతం మంది రాహుల్ గాంధీకి అనుకూలంగా ఓటు వేయగా, 15 శాతం మంది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, 15శాతం మంది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లను ఎన్నుకున్నారు. జనవరిలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో రాహుల్‌గాంధీకి కేవలం 13శాతం మందే ఓటు వేశారు. అదే సమయంలో కేజ్రీవాల్‌ని 27శాతం మంది ఎన్నుకున్నారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ శాతం 24కు పెరగగా.. ఢిల్లీ సీఎంది మాత్రం 27 నుంచి 15కు పడిపోయింది.

జోడో యాత్ర ఎఫెక్ట్!
రాహుల్ గాంధీ గ్రాఫ్‌ని అమాంతం పెంచింది జోడో యాత్రనేని మరోసారి తేలింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన తర్వాత రాహుల్ ఇమేజ్‌ 44శాతం పెరిగినట్టు సర్వేలో తేలింది. అయితే జోడోయాత్ర తర్వాత 33 శాతం మంది ఆయన ఇమేజ్ మారలేదని చెప్పగా.. 13 శాతం మంది ఈ యాత్ర తర్వాత రాహుల్ ఇమేజ్‌ తగ్గినట్టు అభిప్రాయపడ్డారు. ఇక ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ పనితీరు గురించి అడిగిన ప్రశ్నకు 34 శాతం మంది అద్భుతంగా ఉందని అభివర్ణించగా.. 27 శాతం మంది బాలేదని చెప్పారు. 18శాతం మంది గుడ్‌ అని చెప్పగా, మరో 15 శాతం మంది యావరేజ్‌గా ఉందని చెప్పారు.

అనర్హత మాటేంటి?
లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీ అనర్హతపై ఇండియా టుడే సీ ఓటర్‌ సర్వేలో ఆసక్తికర లెక్కలు కనిపిస్తున్నాయి. అనర్హత వేయడం కరెక్టేనని 31శాతం మంది అభిప్రాయపడగా.. మరో 31శాతం మంది మాత్రం అనర్హత రాజకీయ ప్రేరేపితంగా జరిగిందని అభిప్రాయపడ్డారు. 21 శాతం మంది ఇలా చేయకుండా ఉండాల్సిందని.. ఇది చాలా కఠినమైన నిర్ణయమన్నారు. 'మోదీ' ఇంటిపేరు కేసులో దోషిగా తేలడంతో లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ నెల ప్రారంభంలో సుప్రీం కోర్టు రాహుల్‌ శిక్షపై స్టే విధించడంతో అనర్హత రద్దు చేశారు. దీంతో రాహుల్ మళ్లీ పార్లమెంట్‌లో ఎంపీగా అడుగుపెట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు