Mamata Banerjee: 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'పై అత్యున్నత స్థాయి కమిటీకి దీదీ లేఖ.. ఏం అన్నారంటే?
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీకి పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ లేఖ రాశారు. 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'పై ఏకీభవించడంలేదని చెప్పారు. ఈ విషయంలో ప్యానెల్ సూత్రీకరణ, ప్రతిపాదనతో విభేదిస్తున్నామన్నారు.