నేను నిర్దోషిని...ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు..!!

మోదీ ఇంటిపేరు...వ్యాఖ్యల కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా వీలు కల్పించాలంటూ రాహుల్ గాంధీ కోరారు. ఈ వివాదస్పద వ్యాఖ్యల విషయంలో తాను ఏ విధంగానూ క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపారు.

author-image
By Bhoomi
నెహ్రూ మెమోరియల్ పేరు మార్చడంపై తొలిసారి స్పందించిన రాహుల్..ఏమన్నారంటే..!!
New Update

Rahul Gandhi :  మోదీ(Modi) ఇంటిపేరు కేసులో తాను ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని దుర్వినియోగం చేసి..ఎలాంటి తప్పు చేయకపోయినా..తనను క్షమాపణ చెప్పాలని కోరడం న్యాయ ప్రక్రియను అపహస్యం చేసినట్లే అవుతుందని రాహుల్ గాంధీ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ అఫిడవిట్‌లో రాహుల్ గాంధీ... మోదీ ఇంటి పేరు కేసులో(Modi Surname Case) తాను నిర్దోషినని ఎప్పుడో స్పష్టం చేశానని, ఈ నేరానికి క్షమాపణ చెప్పవలసి వస్తే, తాను ఇప్పటికే చెప్పేవాడినని అన్నారు. క్షమాపణలు చెప్పడానికి నిరాకరించినందుకే రాహుల్ గాంధీ 'అహంకారి' అని దుర్భాషలాడుతున్నారంటూ తనపై కేసు పెట్టిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

మోదీ పేరుతో ఏ వర్గం లేదని తన పిటిషన్ లో పేర్కొన్నారు రాహుల్ గాంధీ . అధికారికంగా మోదీ సమాజం, మోదీ వర్గం అనే వి లేవన్నారు. మోదీవానిక సమాజ్, మోధ్ గంచి సమాజ్ అనే వర్గాలే ఉన్నాయన్నారు. ఇంటిపేరు మోదీ అనేది అనేక కులాలవారికి ఉంటుందంటూ పూర్ణేష్ మోదీ కూడా అంగీకరించారు. నీరవ్ మోదీ,లలిత్ మోదీ, మోహుల్ ఛోక్సీలు ఒకే సామాజిక వర్గానికి చెందివారు కాదన్న విషయాన్నీ ఫిర్యాదుదారు అంగీకరించారన్నారు కాబట్టి మోదీ సమాజం మొత్తాన్ని రాహుల్ గాంధీ కించపరిచారన్న వాదనే తెరపైకి రాదంటూ సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ తరపును దాఖలైన పిటిషన్ పేర్కొంది.

'క్రిమినల్ ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను ఉపయోగించి ఎటువంటి తప్పు లేకుండా క్షమాపణలు చెప్పమని ఒత్తిడి చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే' అని రాహుల్ గాంధీ తన సమాధానంలో తెలిపారు. ఈ డిమాండ్‌ను అంగీకరించరాదని కోర్టును ఆశ్రయించారు. నేరం 'చిన్న' స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ కేసును మినహాయింపుగా పరిగణించాలని రాహుల్ గాంధీ అన్నారు. అదే సమయంలో, పార్లమెంటేరియన్‌గా ఆయన చేసిన నష్టాన్ని ఇది భర్తీ చేయలేదనేది కూడా గుర్తుంచుకోవాలి.

మోదీ ఇంటిపేరు వివాదస్పద వ్యాఖ్యలుచేసినందుకు రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు(Surat Court) రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ లోకసభ సభ్యత్వాన్ని కోల్పోవల్సి వచ్చింది. తనకు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ రాహుల్..గుజరాత్ హైకోర్టు ఆశ్రయించారు. అక్కడ కూడా రాహుల్ నిరాశే ఎదురైంది. రాజకీయాల్లో స్వచ్చత అవసరమని పేర్కొంటూ రాహుల్ పిటిషన్లను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పూర్ణేశ్ మోదీ తోపాటు గుజరాత్ సర్కార్ కు జూన్ 21న నోటీసులు పంపించింది. రాహుల్ పిటిషన్ పై స్పందించాలని కోర్టు ఆదేశించింది.

Also Read: జ్ఞాన్‌వాపీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!

#modi #rtvnewstelugu #purnesh-modi #modi-surname-case #pm-modi #rahul-gandhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి