Rahul Gandhi: ప్రజల్ని విడదీసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి: రాహుల్ గాంధీ

మతం, కులం, భాష ఆధారంగా.. ప్రజల్ని విడదీసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రజల మధ్య విభేధాలను సృష్టించి.. వారి సంపదను తమ గుప్పిట్లోకి తీసుకురావడమే కాషాయ నేతల ఉద్దేశమంటూ ధ్వజమెత్తారు.

Rahul gandhi: అబద్ధాలాడి చరిత్రను చెరపలేరు.. రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్!
New Update

ఓవైపు అయోధ్యలో రామమందిరం మందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైపోయింది. మరికొన్ని గంటల్లో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అయితే వేడుకకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేస్తున్నారు. ఆదివారం అస్సాం-అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతం వద్ద రాజ్‌ఘడ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపై మండిపడ్డారు.

Also Read: సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

మతం, కులం, భాష ఆధారంగా.. ప్రజల్ని విడదీసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రజల మధ్య విభేధాలను సృష్టించి.. వారి సంపదను తమ గుప్పిట్లోకి తీసుకురావడమే కాషాయ నేతల ఉద్దేశమంటూ ధ్వజమెత్తారు. భారత్ జోడో యాత్రలో యువత నిరుద్యోగం గురించి కలత చెందుతున్నట్లు తనకు చెప్పారని.. అలాగే రైతులు కూడా తమ పంటలకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని వాపోయినట్లు పేర్కొన్నారు.

ఇప్పుడు మరోసారి మీ గళం వినేందుకు భారత్ జోడో న్యాయ్‌ యాత్రతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. స్కూల్, కళాశాల విద్య కోసం లక్షలు ఖర్చు చేసినా యువత ఉద్యోగం రావడం లేదని ఆందోళన చెందుతున్నారని అన్నారు.

ముఖ్యంగా జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల చిరు వ్యాపాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కొందరు పారిశ్రామికవేత్తల బాగు కోసమే పనిచేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మేనంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. తమ యాత్ర రాహుల్‌ గాంధీ ప్రయాణం కాదని.. ఇది అస్సాం ప్రజల ప్రయాణమంటూ పేర్కొన్నారు.

Also Read:  రేపు అయోధ్యకు ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే!

#telugu-news #rss #bjp #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe