గెలుపు గుర్రాల వేట..ఇక కాస్కో..! ఇక మాములుగా ఉండదు!

2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్‌ కసరత్తులు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో కీలక మీటింగ్‌ జరగగా.. అజయ్ మాకెన్, హరూన్ యూసుఫ్, కృష్ణ తీరథ్, సందీప్ దీక్షిత్ సహా పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని ఎలాంటి సిఫార్సులను లెక్కచేయకూడదని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తోంది.

New Update
గెలుపు గుర్రాల వేట..ఇక కాస్కో..! ఇక మాములుగా ఉండదు!

Rahul Gandhi, Mallikarjun Kharge meet: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలు కోసం కాంగ్రెస్ పార్టీ చాలా ముందుగానే కసరత్తు ప్రారంభించేసింది. రాష్ట్రాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టింది. సోమవారం ఢిల్లీ జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించి నేతలను పిలిపించి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితిపై ఆరా తీయగా.. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(mallikharjun kharge), వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(rahul gandhi) నేతృత్వంలో ఇవాళ (ఆగస్టు 16) పార్టీ ఢిల్లీ యూనిట్‌తో కీలక భేటీ జరిగింది.

ఈ మీటింగ్‌ ఎందుకంటే?
2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కాంగ్రెస్‌ పరిశీలిస్తుంది. ఈసారి నాలుగు విడతలగా అభ్యర్థుల వడపోత ఉండే అవకాశం కనిపిస్తుంది. గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేయాలని.. ఎలాంటి సిఫార్సులను లెక్కచేయకూడదని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే అధ్యక్షులను ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్రాల అధ్యక్షులు అసెంబ్లీ ఎన్నికల జాబితా అలాగే లోక్‌సభ ఎన్నికల జాబితాను కూడా తయారు చేసేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చే ప్రాథమిక జాబితాను తీసుకుని తమ వద్ద ఉన్న సొంత సర్వే నివేదికతో పోల్చుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారని సమాచారం. రాష్ట్రాల్లో పొత్తులు ఇతర రాజకీయపరమైన అంశాలపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోనుంది.

publive-image
2024 సాధారణ ఎన్నికల వేడి:
కర్ణాటక ఎన్నికల(karnataka elections) ఫలితాలు నింపిన జోష్ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇదే ఊపులో ఈ ఏడాదిజరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌ పెంచిన సోనియా(sonia) టీమ్‌.. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలపైనా కసరత్తు ప్రారంభించింది. ఈసారి కాంగ్రెస్‌కు గెలుపే ముఖ్యం.. రికమెండేషన్లు.. బుజ్జగింపులు లాంటివి ఉండవట. ఎవరు గెలుస్తారో వారే అభ్యర్థి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని ఓడించాడమే ప్రధాన ఎజెండా. అందుకే 'INDIA' మిత్రపక్షాల కూటమిలోని పెద్దలతో ఎలాంటి అలకలు రాకుండా జాగ్రత్త పడుతోంది. పశ్చమబెంగాల్‌ సీఎం మమతతో పాటు అందరిని కలుపుకోని మోదీని గద్దె దించాలని ప్లాన్‌ చేస్తోంది కాంగ్రెస్‌.

publive-image

రాష్ట్రాల నుంచి అభిప్రాయ సేకరణ:
నిజానికి కాంగ్రెస్‌పై ఓ ప్రధాన విమర్శ ఉంది. రాష్ట్ర నేతలు చెప్పే వాటిని పెద్దగా లెక్క చేయకుండా మోనార్క్ లాగా హైకమాండ్‌ సోలో డిసిషన్లు తీసుకుంటుందన్నది ప్రధాన విమర్శ. దీని కారణంగా కాంగ్రెస్‌ చాలా రాష్ట్రాలను కోల్పోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. గెలిచే రాష్ట్రాలను కూడా కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఒంటె ఎద్దు పోకడలతో చేజార్చుకుందని చెబుతుంటారు. అందుకే ఈ సారి అలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా రాష్ట్రాల నుంచి అభిప్రాయలను సేకరిస్తుంది. వాటికి పరిగణనలోకి తీసుకోనే ముందుకు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్‌ పెద్దలు ఉన్నట్టు సమాచారం.

Advertisment
తాజా కథనాలు