Kadapa : వైఎస్ఆర్ దేశానికి మార్గదర్శకుడు.. రాహుల్ గాంధీ! దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజీవ్, వైఎస్ఆర్ ఇద్దరు అన్నదమ్ముళ్లు. వైఎస్ఆర్ ఈ దేశానికి మార్గదర్శకుడు. వైఎస్సార్ పాదయాత్ర నాకు ఆదర్శం. నా చెల్లి షర్మిలను గెలిపించండి'అని కోరారు. By srinivas 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Rahul Gandhi : ఏపీ ఎన్నికల(AP Elections) ప్రచారంలో కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడపలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. షర్మిల తన చెల్లి అన్నారు. రాజకీయాల్లో కుటుంబ సంబంధాలుంటాయని, వైఎస్సార్ తన తండ్రికి సోదరుడన్నారు. రాజీవ్, వైఎస్సార్ ఇద్దరు అన్నదమ్ముళ్లు. ఈ బంధం చాలా ఏళ్ళ క్రితం నుంచే ఉంది. వైఎస్ఆర్ దేశానికి మార్గదర్శకుడు. వైఎస్సార్ పాదయాత్ర నాకు ఆదర్శం. జోడో యాత్ర ఎందుకు స్ఫూర్తి. దేశం మొత్తం పాదయాత్ర చేయాలని వైఎస్ నాకు చెప్పారు. వైఎస్ నాకు అన్ని విషయాల్లో మార్గదర్శకుడిగా ఉన్నారు. పాదయాత్ర చేస్తే ప్రజల్లోకి వెళ్తాం అని వైఎస్సార్ నాకు చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. అందుకే భారత్ జోడో ద్వారా దేశపు వీధుల్లో తిరిగాను. వైఎస్సార్ సామాజిక న్యాయం కోసం రాజకీయం చేశాడంటూ పొగిడారు. వీళ్ళ రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ చేతిలో ఉంది.. అయితే ఇప్పుడు ఏపిలో అది లేదని, మార్పు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. వైఎస్ఆర్ ఢిల్లీలో ఏపి హక్కులపై పోరాటం చేసే వాళ్ళు. ఇవ్వాళ ఏపీని బీజేపీ బి టీమ్ నడిపిస్తుంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ వీళ్ళ రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ చేతిలో ఉందన్నారు. మోడీ చేతిలో సీబీఐ ఉంది. ఈడీ ఉంది. అందుకే వీళ్ళ చెప్పు చేతల్లో ఉన్నారు. వైఎస్సార్ సిద్ధాంతం.. కాంగ్రెస్ సిద్ధాంతం బీజేపీకి వ్యతిరేకం. జగన్ మాత్రం బీజేపీకి మద్దతుగా ఉన్నారు. బీజేపీనీ జగన్ ఒక్క మాట అనరు. అవినీతి బయట పడుతుందని భయం. ఇదే భయం చంద్రబాబుకి ఉంది. ఏపీ హక్కులు ఢిల్లీలో వినపడాలంటే కాంగ్రెస్ రావాలి. ఏపీ విభజన అయ్యాక బీజేపీ ఎన్నో హామీలు చేసింది. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి అమలు చేయలేదు. ప్రత్యేక హోదా వచ్చిందా ? పోలవరం కట్టారా? కడప స్టీల్ కట్టారా? బీజేపీ ముందు ఏపి ఆత్మ గౌరవం తల దించుకొని ఉంది. ఏపిలో అవినీతి సర్కార్ నడుస్తుందంటూ విమర్శలు గుప్పించారు. ఇది కూడా చదవండి: Atmakur: జగన్ దోపిడీకి విజయసాయి రెడ్డి బాడి గార్డ్.. ఆనం రామనారాయణ షాకింగ్ కామెంట్స్! 2014 లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే అన్ని హామీలు నెరవేరేవని చెప్పారు. 2024లో కాంగ్రెస్ అధికారంలో వచ్చాకా ఇచ్చిన ప్రతి వాగ్ధానం అమలు చేస్తామన్నారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం. పోలవరం ప్రాజెక్టు కడతాం. కడప స్టీల్ ప్లాంట్ కడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో మేము కొన్ని వాగ్ధానాలు ఇచ్చాం. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తాం. నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం. 2.25లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. చరిత్రలో ఎవరు చేయని ఆలోచనలు చేస్తున్నాం. ప్రతి కుటుంబం నుంచి ఒక బీద మహిళను ఎంపిక చేస్తాం. ఆ మహిళకు బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు ఏడాదికి ఇస్తాం. ప్రతి నెల 8500 రూపాయలు ఇస్తాం. కోట్లాది మంది జీవిత శైలి మారుతుంది. మేము కోట్లాది మంది నీ లక్షాది కారులం చేస్తాం. ఈ దేశ ప్రజలను మోడీ సోమరి పోతులను చేస్తున్నారన్నారు. ప్రతి ఏడాది 20 లక్షల ఉద్యోగాలు.. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామని, ప్రతి ఏడాది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని 400కు పెంచుతామని, రాజ్యాంగాన్ని రక్షించే పనిలో ఉన్నమన్నారు. ఈ రాజ్యాంగం పరిరక్షిస్తే మనకు హోదా వస్తుంది. ఈ రాజ్యాంగం ద్వారానే పోలవరం ప్రాజెక్టు వస్తుంది. మోడీ ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మోడీ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. భారతీయుల భవిష్యత్ మన రాజ్యాంగం మీద ఆధారపడి ఉంది. అన్ని వర్గాల ప్రజలకు లభించిన హక్కులు ఈ దేశ రాజ్యాంగం తోనే.. కాంగ్రెస్ , వైఎస్సార్ ఒక్కటే. వైఎస్సార్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ఆలోచనలకి వ్యతిరేకంగా ఉండదు. సీబీఐ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ పేరును చేర్చలేదు. ఇది స్వార్థం కోసం చేసిన పని. వైఎస్సార్ మా వాడు.. వైఎస్సార్ బిడ్డ నా చెల్లెలు ఇవ్వాళ మీ ముందు నిలబడింది. నా చెల్లి పార్లమెంట్ లో ఉండాలి. వైఎస్సార్ సైద్ధాంతిక విలువలు షర్మిల లో ఉన్నాయి. నా చెల్లెలి తరుపున ఏపి ప్రజల వాగ్ధానం అడుగుతున్నా. వైఎస్ షర్మిలను పార్లమెంట్ కు పంపాలి. ఏపి ప్రజల ఆలోచనలు ఢిల్లీలో వినపడాలి. షర్మిల ముందు ఏ సీబీఐ ఏ ఈడి నడవదు. నాకు వాగ్ధానం చేయండి అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. #rahul-gandhi #kadapa #sharmila #ys-rajasekhar-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి