కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మణిపూర్ నుంచి మంబాయి వరకు భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించారు. ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో ఈ యాత్రను రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మణిపుర్‌లో ప్రభుత్వ యంత్రాగం ఫెయిలయ్యిందని.. ఇక్కడ అల్లర్లు జరిగినప్పటికీ కూడా ప్రధాని మోదీ ఇంతవరకు సందర్శించలేదంటూ తీవ్రంగా విమర్శలు చేశారు.
Also Read: మార్చి15 లోపు భారత సైన్యం వెళ్లిపోవాలి: మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు
బాధల్లో ఉన్నప్పుడు ప్రధాని రాలేదు
మణిపూర్ ఇండియాలో అంతర్భాగం కాదని ప్రధాని మోదీ భావిస్తున్నారేమో అంటూ చురకలంటించారు. భారత్‌లో రాజ్యాంగ ప్రవేశికను రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ మతాన్ని రాజకీయాలతో కలిపి.. దేశ ప్రజల్ని రెచ్చగొడుతోందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తోందని అన్నారు. ప్రజలను ఓట్లు అడిగేందుకు మణిపూర్‌కు వచ్చిన మోదీ.. వారు బాధల్లో ఉన్నప్పుడూ రాలేదంటూ ధ్వజమెత్తారు.
ఇది ఎన్నికల యాత్ర కాదు
ఇదిలాఉండగా.. రాహుల్ గాంధీ ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మొత్తం 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 67 రోజుల పాటు జరగనుంది. మణిపూర్ నుంచి ముంబయి వరకు మొత్తం 6,713 కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. చివరికి ఈ యాత్ర మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబయిలో ముగియనుంది. అయితే ఈ యాత్రలో దేశంలో ఉన్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఇది ఎన్నికలకు సంబంధించిన యాత్ర కాదని.. సైద్ధాందిక యాత్రనేనని కాంగ్రెస్ అంటోంది.
Also Read: కరోనా లాంటి మరో వైరస్.. థాయ్‌లాండ్‌లో గుర్తించిన శాస్త్రవేత్తలు..