Rahul Gandhi : ఎన్నో భావోద్వేగాల మధ్య వాయనాడ్‌ను వీడుతున్నా..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఘన విజయాన్ని సాధించారు.దీంతో ఆయన రెండు స్థానాల్లో దేన్నో ఒకదానిని వదులుకోవాల్సి తప్పనిసరి కావడంతో ఆయన వాయనాడ్‌ ను వదులుకుంటున్నట్లు తెలిపారు.

Rahul Gandhi : ఎన్నో భావోద్వేగాల మధ్య వాయనాడ్‌ను వీడుతున్నా..!
New Update

Wayanad : ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వాయనాడ్, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఘన విజయాన్ని సాధించారు. దీంతో ఆయన రెండు స్థానాల్లో దేన్నో ఒకదానిని వదులుకోవాల్సి తప్పనిసరి కావడంతో ఆయన వాయనాడ్‌ ను వదులుకుంటున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో, రాహుల్‌ వాయనాడ్ ప్రజలకు భావోద్వేగాలతో కూడిన ఓ లేఖను రాశారు. "ఐదేళ్ల కిందట నేను మిమ్మల్ని మొదటిసారి కలిశాను. అప్పుడు నేను మీకు పరిచయం లేదు. కానీ మీరు నన్ను నమ్మి నాకు ప్రేమను పంచి ఆశ్రయం ఇచ్చారు... నా ఇల్లు, నా కుటుంబం మీరే అయ్యారు. నాకు అపారమైన ప్రేమను, ఆప్యాయతలను పంచారు. నేను వేధింపులకు గురైనప్పుడు మీ అందరి ప్రేమే నన్ను రక్షించింది.

జూన్ 17న వాయనాడ్ ను వదులుకుంటున్నట్టు మీడియా ముందు నిలబడి ప్రకటిస్తున్నప్పుడు నేను కన్నీరు పెట్టుకోవడం మీరంతా చూసే ఉంటారు. బరువెక్కిన గుండెతో మీ అందరికీ వీడ్కోలు పలుకుతున్నాను. నేను ఇక్కడ లేకపోయినప్పటికీ మీకు ప్రాతినిధ్యం వహించేందుకు నా సోదరి ప్రియాంక రెడీ గా ఉంది. నన్ను ఆదరించినట్టుగానే నా సోదరి ప్రియాంక (Priyanka Gandhi) ను కూడా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు అవకాశం ఇస్తే ఓ అద్భుతమైన ఎంపీగా ఆమె మీకు సేవలు అందిచేందుకు సిద్దంగా ఉంది. మీరు నాకు ఎప్పటికీ కుటుంబ సభ్యులే. మీలో ప్రతి ఒక్కరికీ నేను అండగా ఉంటాను" అంటూ రాహుల్ గాంధీ తన లేఖలో రాశారు.

Also read: నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు!

#congress #rahul-gandhi #politics #raybareli #wayanad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe