లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పడంతో.. జూన్ 4న కౌంటింగ్ రోజున స్టాక్ మార్కెట్ ఘోరంగా పతనమైన సంగతి తెలిసిందే. దాదాపు రూ.30 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. దేశచరిత్రలో అతిపెద్ద స్టాక్‌మార్కెట్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ' మే 28, 29, 30, 31 తేదీల్లో ఎవరో భారీగా షేర్లు కొన్నారు. జూన్ 3న షేర్లు అమ్ముకుని వేల కోట్లు లాభపడ్డారు. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మి కోట్ల మంది షేర్లు కొన్నారు. వీళ్లందరూ 4వ తేదీన రూ.30 లక్షల కోట్లు నష్టపోయారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) విచారణ చేపట్టాలి.
Also Read: కొత్త ఎంపీల్లో ఇంతమంది ఇంటర్ లోపే చదివారా?
షేర్లు కొనమని సలహా ఇచ్చే అధికారం కేంద్రానికి ఎవరిచ్చారు ?. మోదీ, అమిత్‌షాలు ఇంటర్వ్యూలు ఇచ్చిన మీడియా సంస్థలు, వాటి వ్యాపార సంస్థలపై సెబీ ఎప్పటినుంచో దర్యాప్తు చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌కు ఒకరోజు ముందు షేర్లు కొని 3వ తేదీన అమ్ముకుని లాభపడ్డ నకీలీ విదేశీ ఇన్వెస్టర్లు ఎవరు ?. ఫేక్ ఎగ్జిట్‌పోల్స్ వల్ల 5 కోట్ల మంది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దీనికి మోదీ, అమిత్‌షాలే కారణమని' రాహుల్ గాంధీ అన్నారు. ఇది ముమ్మాటికీ క్రిమినల్ చర్య అని.. వీళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: అధైర్య పడొద్దు.. నేతల వద్ద ఓటమిపై జగన్ సంచలన రియాక్షన్!