/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/rachakonda.jpg)
Rachakonda Police: చాలా కాలం నుంచి సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. వాటిని ఆరికట్టేందుకు రాచకొండ పోలీసులు ఎన్నో విధాలుగా ప్రజలకు అవగాహన కలిగేంచేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు కూడా. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులు ఓ ఫన్నీ స్టోరీని సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ ఫన్నీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రావు గారు రిటైర్ అయ్యారు. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ నగదు వచ్చింది. దాని మొత్తం 20 లక్షలు.... తనకి, తన భార్యకి కలిపి జాయింట్ అకౌంట్ తసీఉకుని వారు నగదును అందులో జమ చేసుకున్నారు.
ఓ ఏటీఎం కార్డు కూడా తీసుకున్న రావు గారు పని మీద ఓ సారి బయటకు వెళ్లారు. గంట తరువాత ఇంటికి వచ్చిన ఆయనకు సోఫాలో తన ఫోన్ కనిపించింది. దానిని మర్చిపోయినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంతలో భార్యను ఫోన్ ఏమైనా వచ్చిందా అని అడిగారు. దానికి ఆమె వచ్చిందని చెప్పింది.
బ్యాంకు నుంచి జాయింట్ అకౌంట్ సమాచారం అప్డేట్ చేయమని తెలిపింది. దీంతో రావుగారికి చెమటలు పట్టేశాయి. ఓటీపీ ఇచ్చావా అని ఎంక్వైరీ చేశారు. అవును అని సమాధానం అటు నుంచి. బ్యాంకు మేనేజరే స్వయంగా ఫోన్ చేసి వివరాలు అడిగారు. అందుకే ఇచ్చాను అని తెలిపింది. భార్య మాటలు విన్న రావుగారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
తల తిరుగుతున్నట్లు అనిపించింది. మొబైల్ లో బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేస్తే రూ. 20 లక్షలు అలాగే ఉన్నాయి. ఏ ఓటీపీ ఇచ్చావు అని ఆయన అడిగారు. భార్య అమాయకంగా ఓటీపీ 4042 అని వచ్చింది. జాయింట్ అకౌంట్ కదా..నా వంతు ఓటీపీ 2021 ఇచ్చానని చెప్పింది.
రావుగారికి పోయిన ప్రాణం మళ్లీ తిరిగి వచ్చినట్లయింది. హమ్మయ్య ఇంత తెలివైన భార్య నాకు దొరకడం నా అదృష్టం అనుకున్నాడు. జాయింట్ అకౌంట్ వల్ల ఇన్ని లాభాలా ...అందుకే కదా అర్థాంగి అంటారని క్యాప్షన్ కూడా ఇస్తూ ఫన్నీ పోస్ట్ ను పోస్టు చేశారు.
ఇలా తమాషా పోస్ట్ లను అందరూ చదవాలని భావించి సైబర్ నేరాల పై అవగాహన కల్పించేందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్ ఈ తరహా ప్రయోగాలు చేస్తుంది.
Don't share your Bank Account details, OTP, ATM, or Credit card details with anyone. Be Alert, Be Smart.
#onlinefrauds #cybercrime #bealert pic.twitter.com/foqu80ZgUe
— Rachakonda Police (@RachakondaCop) June 19, 2024
Also read: నా సర్వస్వానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ…సతీమణికి బాబు స్పెషల్ విషెస్!