Manipur:మణిపూర్లో కాల్పులు..కమాండోను కాల్చి చంపిన ఉగ్రవాదులు మణిపూర్లో ఈరోజు తెల్లవారుఝామున ఉన్నట్టుండి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెండుసార్లు కాల్పులు జరిపారు. ఇందులో మణిపూర్ కమాండో ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది సైనికులు గాయపడ్డారు. By Manogna alamuru 17 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Manipur :ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అల్లర్లు ఆగడం లేదు. అక్కడ అల్లరి మూకలు, ఉగ్రవాదులు దాడులకు తెగడబడుతూనే ఉన్నారు. ఈరోజు తెల్లవారు ఝామున టెంగ్నౌపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఉగ్రవాదులు ఒక కమాండోను కాల్చి చంపారు. ఎమా కొండోంగ్ లైరెంబి దేవి మందిర్ సమీపంలో భద్రతా బలగాలు నిద్రిస్తుండగా దుండగులు దాడులు జరిపారు. చికిమ్ విలేజ్ కొండపై నుండి కాల్పులు జరిసినట్టు తెలుస్తోంది. దీని తర్వాత భద్రతా బలగాలు ఎదరు కాల్పులు జరిపాయి. మొదట దాడి జరిగిన ప్రదేశానికి కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న అసోం రైఫిల్స్ రంగంలోకి దిగి ఎదురుకాల్పులు జరిపారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చేపట్టారు. Also read:అయోధ్యకు భారీ భద్రత..సీసీ కెమెరాలు, డ్రోన్లు, అడుగడుగుకీ పోలీసులు ఆకస్మికంగా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు... మొదటి సారి కాల్పులు జరిగిన గంట తర్వాత మళ్ళీ కాల్పులకు పాల్పడ్డారు దుండుగులు. ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్ దేఖునాయ్ రిసార్ట్ దగ్గర ఉన్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. రెండు దాడులను ఆకస్మికంగానే చేవారు. రెండోసారి జరిపిన దాడిలో కమాండో అధికారి చనిపోయారని...మరి కొంత మంది సైనికులు గాయపడ్డారని చెప్పారు. కాల్పుల్లో మరణించిన కమాండో.. అంతకు ముందు మణిపూర్(Manipur) లో జరిగిన కాల్పులు కూడా కలకలం రేపాయి. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ కమ్యూనిటీ మధ్య గొడవ జరిగింది. దాని తర్వాత కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యం అయ్యారు. ఆ తరువాత వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ నిర్వహించాయి. నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడమ్ ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా గుర్తించారు. ఈ కాల్పుల వల్ల 100 మందికి పైగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. #security-forces #police #terrorists #manipur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి