ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన తల్లి.. కానీ చివరికి..

జమ్మూకశ్మీర్‌లోని ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువలకు జన్మనిచ్చింది. కానీ గంటల వ్యవధిలోనే ఆ నలుగురు చిన్నారులు సరైన వైద్యం అందక మృతి చెందడం కలకలం రేపింది. కుప్వారా జిల్లా ఆసుపత్రిలో కలీదా బేగం అనే మహిళ ముగ్గురు మగ, ఒక ఆడ శిశువులకు సాధారణ కాన్పులోనే జన్మనిచ్చింది. అయితే వారు తక్కువ బరువుతో జన్మించడంతో సరైన సదుపాయాలు లేక వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వారిని తీసుకెళ్లేలోపే గంటల వ్యవధిలో ఆ నలుగురు చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

New Update
ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన తల్లి.. కానీ చివరికి..

సాధారణంగా మహిళలు ఒక్కరు లేదా ఇద్దరికి జన్మనిస్తారు. కొన్ని సందర్భాల్లో ముగ్గురు అంతకంటే ఎక్కువ మందికి జన్మనిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా అనే జిల్లాలో ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఇక్కడ ఆమెకు సాధారణ కాన్పు కావడం మరో విశేషం. అయితే పుట్టిన శిశువుల్లో ఒక అమ్మాయి, ముగ్గురు మగవాళ్లు ఉన్నారు. కానీ ఆ నలుగురు చిన్నారులు కూడా గంటల వ్యవధిలోనే చనిపోవడం కలకలం రేపింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కుప్వారా జిల్లా కేరాన్ గ్రామానికి చెందిన క‌లీదా బేగం అనే మహిళ గ‌ర్భిణి. అయితే ఆదివారం నాడు ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో కలీదా బేగంను స్థానికంగా ఉన్న ప్రైమ‌రీ హెల్త్ కేర్ సెంట‌ర్‌కు తీసుకెళ్లారు. ఆమెపై ప‌రీక్షలు చేసిన వైద్యులు.. ఇక్కడ కాన్పు చేయ‌డం సాధ్యం కాదని.. కుప్వారా జిల్లా ఆస్పత్రికి వెళ్లండని.. క‌లీదా కుటుంబ సభ్యుల‌కు వైద్యులు సూచించారు. ఇక‌ సోమ‌వారం తెల్లవారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో కుప్వారా జిల్లా ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు.

అయితే అక్కడ నార్మల్ డెలివ‌రీ ద్వారానే ఒకేసారి ఏకంగా న‌లుగురు శిశువుల‌కు జ‌న్మనిచ్చింది. ఈ న‌లుగురిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక‌రు అమ్మాయి. మరో బాధాకర విషయమేంటంటే ఈ శిశువులంద‌రూ కూడా త‌క్కువ బ‌రువుతో పుట్టారు. అయితే నలుగురు చిన్నారులు నెలలు నిండకుండానే, తక్కువ బరువుతో జన్మించినట్లు వైద్యులు చెప్పారు. వారికి ప్రత్యేక సంర‌క్షణ అవ‌స‌ర‌మ‌ని, నియోనాటల్ ఇంటెన్వివ్ కేర్ యూనిట్‌లో వెంటనే చేర్పించాల‌ని తెలిపారు. కానీ ఆ ఆసుపత్రిలో అది అందుబాటులో లేదు. కానీ మంగ‌ళ‌వారం తెల్లవారుజామున ముగ్గురు అబ్బాయిలు కుప్వారా ఆస్పత్రిలోనే మ‌ర‌ణించారు. దీంతో ఆడ శిశువును మెరుగైన చికిత్స కోసం శ్రీన‌గ‌ర్ ఆస్పత్రికి త‌ర‌లించారు. కానీ ఆ చిన్నారి కూడా అక్కడ చ‌నిపోయింది.

ఇలా కొన్ని గంట‌ల వ్యవ‌ధిలోనే న‌లుగురు శిశువులు ప్రాణాలు కోల్పోవడంతో కలిదా కుటుంబ స‌భ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే ప్రస్తుతం క‌లీదా ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు చెప్పారు. వాస్తవానికి కుప్వారా జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి, నవజాత శిశువుల అత్యవసర సంరక్షణ సౌకర్యాలు అనేవి అందుబాటులో లేవు. దీంతో అక్కడికి వైద్యం కోసం వచ్చిన వారిని శ్రీనగర్‌కు పంపిస్తుంటారు. అయితే సకాలంలో వైద్యం అందక చాలా దూరం వెళ్లడం వల్ల రోగులు మరణించిన ఘటనలు ఎన్నో జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisment
తాజా కథనాలు