ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన తల్లి.. కానీ చివరికి..
జమ్మూకశ్మీర్లోని ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువలకు జన్మనిచ్చింది. కానీ గంటల వ్యవధిలోనే ఆ నలుగురు చిన్నారులు సరైన వైద్యం అందక మృతి చెందడం కలకలం రేపింది. కుప్వారా జిల్లా ఆసుపత్రిలో కలీదా బేగం అనే మహిళ ముగ్గురు మగ, ఒక ఆడ శిశువులకు సాధారణ కాన్పులోనే జన్మనిచ్చింది. అయితే వారు తక్కువ బరువుతో జన్మించడంతో సరైన సదుపాయాలు లేక వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వారిని తీసుకెళ్లేలోపే గంటల వ్యవధిలో ఆ నలుగురు చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
/rtv/media/media_files/KT6rmZeDda4tseTowmzv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Baby-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/dengue-jpg.webp)