BIG NEWS : 8 మంది మాజీ నావి అధికారులను విడుదల చేసిన ఖతార్‌.. భారత్‌ కు తిరిగి వచ్చిన ఏడుగురు అధికారులు!

ఖతార్‌ లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికా అధికారులను ఖతార్‌ విడుదల చేసింది. వీరిలో 7 గురు అధికారులు భారత్‌ కి తిరిగి వచ్చారు.మాజీ నావి అధికారులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.

New Update
BIG NEWS : 8 మంది మాజీ నావి అధికారులను విడుదల చేసిన ఖతార్‌.. భారత్‌ కు తిరిగి వచ్చిన ఏడుగురు అధికారులు!

India : ఖతార్‌(Qatar) లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికా అధికారులను(Former Navy Officers) ఖతార్‌ విడుదల చేసింది. వీరిలో 7 గురు అధికారులు భారత్‌(India) కి తిరిగి వచ్చారు. ముందు వీరందరికీ మరణ శిక్ష విధించారు. ఆ తరువాత దానిని జైలు శిక్షగా మార్చింది. మాజీ నావి అధికారులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.

వారిలో 7 గురిని తమ సొంత దేశానికి పంపడానికి ఖతార్‌ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో అధికారిని కూడా తీసుకుని వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరణశిక్షను జైలు శిక్షగా మార్చారు.

ఈ 8 మంది మాజీ నావి అధికారులను స్టేట్ సెక్యూరిటీ బ్యూరో ఆఫ్ ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(Intelligence Agency) 30 ఆగస్టు 2022న అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ అధికారులందరూ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ(Dahra Global Technologies & Consultancy), ఖతార్ నౌకాదళానికి శిక్షణ ఇచ్చే ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు. దహ్రా ప్రపంచ రక్షణ సేవలను అందిస్తుంది.

ఈ 8 మంది నావికులతో పాటు, దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ అధిపతి స్క్వాడ్రన్ లీడర్ ఖమీస్ అల్ అజ్మీని కూడా అరెస్టు చేశారు, అయితే నవంబర్ 2022లో విడుదల చేశారు. 26 అక్టోబర్ 2023న, ఈ మాజీ నావి అధికారులందరికీ మరణశిక్ష విధించడం జరిగింది. ఆ తర్వాత, 28 డిసెంబర్ 2023న, వారి మరణశిక్షను జైలు శిక్షగా మార్చారు.

Also Read : బంగారం.. వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి.. ఈరోజు రేట్లివే!

ఇజ్రాయెల్ గూఢచర్యం ...

ఈ సైనికులపై వచ్చిన ఆరోపణలను ఖతార్ ఎప్పుడూ బహిరంగపరచలేదు. అయితే మాజీ భారతీయ మెరైన్లను అరెస్టు చేసిన ఆరోపణలపై ప్రపంచంలోని వివిధ మీడియా సంస్థలు రాశాయి. ఈ నావి అధికారులంతా కూడా ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఈ 8 మంది మాజీ నేవీ అధికారులు ఇజ్రాయెల్‌కు ఖతార్ జలాంతర్గామి ప్రాజెక్టు(Qatar Submarine Project) కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.

అక్టోబర్ 30న, ఈ నావికుల కుటుంబాలు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలుసుకుని, వారిని తమ దేశానికి తిరిగి తీసుకురావాలని కోరారు. దీని తర్వాత ఖతార్ రాజకుటుంబంతో టర్కీకి చాలా మంచి సంబంధాలు ఉన్నందున ఖతార్‌ను ఒప్పించేందుకు మంత్రిత్వ శాఖ టర్కీయే సహాయం తీసుకుంది. ఈ విషయంలో భారత్ కూడా అమెరికాతో మాట్లాడిందని, ఆ తర్వాత ఆ 8 మంది భారతీయులను విడుదల చేసేందుకు ఖతార్‌ను ఒప్పించవచ్చని తెలిపింది.

ఈ క్రమంలోనే నావి అధికారులను ఖతార్‌ విడుదల చేయడంతో పాటు వారిలో 7 గురిని భారత్‌ కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లను చేసి పంపించింది. ఈ క్రమంలో ఖతార్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల పేర్లను ఖతార్‌ ప్రభుత్వం విడుదల చేసింది.

కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్ ,కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, నావికుడు రాగేష్.

Also Read : ఈ హగ్‌ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు