Gold Rates Today: బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా బంగారం పది గ్రాములకు దాదాపుగా 600 రూపాయల వరకూ తగ్గింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుతుండడంతో బంగారం కొనడానికి ఇదే మంచి సమయం అని అందరూ భావిస్తున్నారు. బంగారం, వెండి ధరలు(Gold Rates) నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Rate) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు నిన్ననిలకడగా ఉన్న వెండి ధరలు కూడా ఈరోజు తగ్గుదల కనబరిచాయి. ఈరోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 12) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rates: బంగారం..వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి.. ఈరోజు రేట్లివే!
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,690ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,940ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.76,400 వద్ద ఉంది.
Translate this News: