ఫుల్ గా తాగిన ఓ వ్యక్తి మెడలో కొండ చిలువ వేసుకుని ఓ పెట్రోల్ బంకు వద్దకు వచ్చాడు. అక్కడ పని చేస్తున్న వారిని ఫోన్ తో సెల్ఫీ కావాలని అడిగాడు. ఈ లోపే కొండచిలువ ఆ వ్యక్తి మెడను చుట్టి గట్టిగా నొక్కేయడంతో కిందపడిపోయాడు. వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది పామును మెడ నుంచి విడిపించి వ్యక్తిని కాపాడారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో జరిగింది. శనివారం రాత్రి మద్యం ఫుల్లుగా తాగిన చంద్రన్ అనే వ్యక్తి మెడలో కొండచిలువను మెడలో అలంకరించుకొని వలపట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లాడు. తన మెడలో ఉన్న కొండ చిలువతో పాటు తనను ఓ సెల్ఫీని తీయాలని అక్కడి వారిని కోరాడు.
Also read: ఆ రాష్ట్రంలో వర్షాలకు నీట మునిగిన రోడ్లు..మరో 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ఈ క్రమంలోనే కొండచిలువ ఒక్కసారిగా చంద్రన్ మెడను గట్టిగా చుట్టుకుని నొక్కేయడం ప్రారంభించింది. దీంతో చంద్రన్ ఊపిరి ఆడక కింద పడిపోయాడు. వెంటనే పెట్రోల్ బంకులో పని చేస్తున్న అభిషేక్ అనే వ్యక్తి కొండచిలువను విడిపించడానికి ముందుకు వెళ్లాడు.
ఒక సంచితో కొండచిలువను మెడ నుంచి విడిపించాడు. వెంటనే కొండచిలువ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. ఎలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.