ఫుల్ గా తాగిన ఓ వ్యక్తి మెడలో కొండ చిలువ వేసుకుని ఓ పెట్రోల్ బంకు వద్దకు వచ్చాడు. అక్కడ పని చేస్తున్న వారిని ఫోన్ తో సెల్ఫీ కావాలని అడిగాడు. ఈ లోపే కొండచిలువ ఆ వ్యక్తి మెడను చుట్టి గట్టిగా నొక్కేయడంతో కిందపడిపోయాడు. వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది పామును మెడ నుంచి విడిపించి వ్యక్తిని కాపాడారు.
పూర్తిగా చదవండి..కొండ చిలువతో సెల్ఫీ కావాలన్నాడు..కానీ చివరికి ఏమైందంటే!
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఫుల్లుగా తాగిన చంద్రన్ అనే వ్యక్తి మెడలో కొండచిలువను మెడలో అలంకరించుకొని వలపట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లాడు. తన మెడలో ఉన్న కొండ చిలువతో పాటు తనను ఓ సెల్ఫీని తీయాలని అక్కడి వారిని కోరాడు. ఈ క్రమంలోనే కొండచిలువ ఒక్కసారిగా చంద్రన్ మెడను గట్టిగా చుట్టుకుని నొక్కేయడం ప్రారంభించింది.దీంతో చంద్రన్ ఊపిరి ఆడక కింద పడిపోయాడు.
Translate this News: