పీవీ నరసింహారావు జీవితం మనకు ఆదర్శం: కవిత నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు పట్వారీ నుంచి ప్రధానిగా ఎదిగిన తీరును కవిత వెల్లడించారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ శాఖ ద్వారా మానవ వనరులు ఏవిధంగా సృష్టించుకోవాలో ఆలోచించి రాను రాను ఆ శాఖకు కొత్త పదాలు జోడించారన్నారు. By Karthik 07 Aug 2023 in నిజామాబాద్ New Update షేర్ చేయండి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గం చౌరస్తాలో మాజీ ప్రధాని పీసీ నరసింహారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మాజీ ప్రధాని కొడుకు పీవీ ప్రభాకర్ రావు, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. పీవి నరసింహారావు విగ్రహం ఏర్నాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పీవి నరసింహారావు రాష్ట్ర ప్రజలకు స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకున్న వారికి కొత్తగా ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుందన్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచి వెళ్లి దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అన్నారు. ఆ మహానుభావుడి గురించి ఇతర ప్రాంతాల వారు గొప్పగా చెప్పుకుంటుంటే అది మనందరికీ గర్వకారణమన్నారు. 15 రకాల బాషలు మాట్లాడడం అంటే మామూలు విషయం కాదన్న కవిత.. అలాంటి మేదో సంపత్తిగల వ్యక్తి పీవీ నరసింహారావు అన్నారు. ఆయన హంగులూ ఆర్భాటాలకు పోకుండా.. పట్వారీ ఏవిధంగా ఉండేవారో పీవీ నరసింహార రావు ప్రధాని అయ్యాక కూడా దోతీ, కోటు, శాలువాతో ఉన్నారని కవిత గుర్తు చేశారు. ఆయన ప్రధాని హోదాలో ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో కూడా అలానే సింపుల్‌గా వెళ్లేవారన్నారు. ఇతర దేశాలకు చెందిన నేతలు ఆయనను పంచ కట్టుగురించి అడిగి తెలుసుకునేవారని గర్తు చేశారు. గతంలో కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన పీవీ నరసింహారావు.. విద్య వల్ల ఏం జరుగుతోంది. విద్య వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం ఉందని ఆలోచించిన ఆయన.. మన పిల్లలకు చదువు చెబితే వాళ్లు మానవ వణరులను పెంపొందించుకునే ఉండాలని, అందుకోసమే విద్యా శాఖ పేరును తొలగించి మానవ వనరులను పెంపొందించే శాఖగా మార్చారన్నారు. ఇందులో భాగంగానే నవోదయా కాన్సెప్ట్ స్కూళ్లను దేశ వ్యాప్తంగా విస్తరింపచేశారన్నారు. ఆయన కృషి వల్లే తెలంగాణలో లక్షలాది మంది మేధావులు వెలుగులోకి రావడం మనందరికీ గర్వకారణమన్నారు. తనకు పని గురించి తెలియక పోతే తాను పది మందికి దానికి గురించి ఎలా చెప్పుతానని ఆలోచించి క్యంప్యూటర్ నేర్చుకున్నారని కవిత వెల్లడించారు. 65 సంత్సరాల వయసులో కంప్యూటర్ నేర్చుకోవడం అనేది అప్పట్లో గొప్ప విషయమన్నారు. పట్వారి నుంచి ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగిన పీవీ నరసింహారావు జీవితం మనందరికీ ఆదర్శనీయమని కవిత పేర్కొన్నారు. #brs #mlc-kavitha #nizamabad #vigraham #pv-narasimha-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి