Watch Video: క్రికెట్‌ బాల్‌ ప్రైవేట్ పార్ట్‌కు తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి

మహారాష్ట్రలోని పుణేలో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. బౌలింగ్ వేస్తుండగా బ్యాటర్ కొట్టిన బాల్ అతడి ప్రైవేట్ పార్ట్‌కు తగిలింది. దీంతో అతడు అక్కడే కూలిపోయాడు. స్నేహితులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Watch Video: క్రికెట్‌ బాల్‌ ప్రైవేట్ పార్ట్‌కు తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి

మహారాష్ట్రలోని పుణేలో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతుండగా.. అతడి ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలి మృతి చెందాడు. గురువారం నాడు లోహెగావ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శౌర్య కాళిదాస్ ఖాండ్వే అనే బాలుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. బౌలింగ్ వేస్తుండగా.. బ్యాటర్ కొట్టిన బాల్ వేగంగా వచ్చి అతడి ప్రైవేట్ పార్ట్‌కు తగిలింది. దీంతో ఆ బాలుడు అక్కడే నొప్పితో కూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. శౌర్య మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also read: సముద్రంలో ఈతకు దిగి ఐదురుగు మెడికో విద్యార్థులు మృతి..

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టానికి తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాత అతడికి ఏం జరిగింది అనే విషయం తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. శౌర్యతో క్రికెట్ ఆడిన వారిపై కూడా విచారణ చేస్తామన్నారు. శౌర్య ఎంతో ఉత్సాహంగా ఉండేవాడని.. పెద్దయ్యాక రెజ్లర్ కావాలని లక్ష్యం పెట్టుకున్నాడని అతడి మామయ్య తెలిపారు. చిన్నప్పటి నుంచి శౌర్యకు క్రీడలంటే ఇష్టమని.. ముఖ్యంగా క్రికెట్ అంటే ప్రాణమని.. కానీ ఇప్పుడు ఆ ఇష్టమే మృత్యువుకు దారితీసిందంటూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Also read: కోవిషీల్డ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు