Diabetes: గుమ్మడికాయను ఇలా వండుకుని తింటే మధుమేహం పరార్‌

మధుమేహానికి ప్రధాన కారణం ఆహారంలో స్వీట్లు, కార్బోహైడ్రేట్లు తీసుకోవడమని నిపుణులు అంటున్నారు. గుమ్మడికాయ కూర తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఓట్స్, గుడ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.

New Update
Diabetes: గుమ్మడికాయను ఇలా వండుకుని తింటే మధుమేహం పరార్‌

Diabetes: డయాబెటిస్‌ ఉన్నవారు స్వీట్లు తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొద్దిగా తీపి గుమ్మడికాయ, గుమ్మడికాయ గుజ్జు కూడా షుగర్‌కు మంచిదని చెబుతున్నారు. గుమ్మడికాయను ఒక పద్ధతిలో వండితే మధుమేహ రోగులు నిర్మోహమాటంగా తీసుకోవచ్చని అంటున్నారు. మధుమేహం ఈ రోజుల్లో యువతను కూడా వదలడం లేదు. వారసత్వం, జీవనశైలి కారణంగా షుగర్‌ వస్తోంది. ఈ వ్యాధి శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. మధుమేహానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు. ముఖ్యంగా స్వీట్లు, కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల షుగర్‌ తొందరగా వస్తుంది.

మధుమేహం ఉన్నవారికి ఏ ఆహారం బెస్ట్‌:

  • కూరగాయలు, పండ్లు సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివి. గుమ్మడికాయ మధుమేహ రోగులకు ఔషధంగా ఉపయోగపడే తీపి కూరగాయ. గుమ్మడికాయ కూర తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఈ కూర చేసుకోవడానికి గుమ్మడికాయతో పాటు ఉల్లిపాయలు, క్యారెట్లు, పుట్టగొడుగులు, కొత్తిమీర ఆకులు, ఓట్స్‌ అవసరం. గుడ్డు తినేవారు దాన్ని వేసుకోవచ్చు.

గుమ్మడికాయ కూర:

  • దీన్ని సిద్ధం చేయడానికి గుమ్మడికాయను తురుముకోవాలి. మైక్రోవేవ్‌లో కాసేపు ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము వేయాలి. పుట్టగొడుగులను కట్‌ చేసి ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా కలపాలి. గుడ్డును అందులో వేసి ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేయాలి. ఓట్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో కొద్దిగా నెయ్యి రాసి అందులో వేసి ఉడికించాలి. కావాలంటే మైక్రోవేవ్‌ ఉపయోగించవచ్చు. ఓట్స్, గుడ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. ఓట్స్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా గుడ్లు మంచి సమతుల్య ఆహారం. ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇది కూడా చదవండి: రెండు వారాలు ఇలా చేస్తే లావుగా ఉండే ముఖం స్లిమ్‌గా అవుతుంది

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఇలాంటి బాదం పప్పులు అస్సలు కొనకండి.. విషపూరితం

Advertisment
Advertisment
తాజా కథనాలు