Face Fat: రెండు వారాలు ఇలా చేస్తే లావుగా ఉండే ముఖం స్లిమ్‌గా అవుతుంది ప్రతిరోజు సైక్లింగ్, రన్నింగ్ చేయడం వల్ల, ఎక్కువగా నవ్వినా, ఎక్కువ నీరు తాగితే ముఖంలో కొవ్వు కరుగుతుంది. ఫేషియల్, యోగా, మసాజ్ ముఖంపై కొవ్వును తగ్గించి స్లిమ్‌గా మారడానికి సహాయపడతాయి. ఉప్పు, తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 04 Feb 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Face Fat: కొందరికి బరువు పెరగడంలో భాగంగా ముఖంలో కొవ్వు పెరగడం జరుగుతుంది. కొంతమంది తమ ముఖం బొద్దుగా కనిపించినప్పుడే బరువు పెరిగినట్లు అనుకుంటారు. కొంతమంది స్లిమ్ బాడీ కలిగి ఉంటారు కానీ వారి ముఖం గుండ్రంగా ఉంటుంది. ముఖంపై కొవ్వును కరిగించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం. ముఖం కోసం వ్యాయామం: బరువు తగ్గడానికి వ్యాయామం చేసినట్లే మన ముఖంలో కొవ్వు తగ్గించుకోవడానికి కూడా కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. ఎక్కువగా నవ్వినా కొవ్వు కరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ సేపు తలను పైకి పట్టుకుని ఒక్కసారి కిందకి చూడటం వల్ల ముఖ కండరాలు దృఢంగా ఉంటాయి. అలాగే ఫేషియల్, యోగా, మసాజ్ ముఖంపై కొవ్వును తగ్గించి స్లిమ్‌గా మారడానికి సహాయపడతాయి. కార్డియో వ్యాయామం: ముఖంలోని కొవ్వును తగ్గించుకోవడానికి కార్డియో వర్కవుట్ ఉపయోగపడుతుంది. ప్రతిరోజు సైక్లింగ్, రన్నింగ్ చేయడం వల్ల ముఖంలో కొవ్వు కరుగుతుంది. కార్డియో వ్యాయామం చేయడం వల్ల ముఖానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. కాబట్టి ఇది మీ స్కిన్ టోన్‌ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారం: ఎన్ని వ్యాయామాలు చేసినా ఆహారం సరిగ్గా లేకుంటే దాని వల్ల ప్రయోజనం ఉండదు. దీనివల్ల మన శరీరానికి వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు అందవు. మీ ఆహారంలో లీన్ మాంసాలు, కూరగాయలు, పండ్లను సరైన మొత్తంలో చేర్చుకుంటే మీ ముఖం నుంచి కొవ్వును తగ్గించవచ్చు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలకు బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఉప్పు, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం మంచిది కాదు. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరగడంతోపాటు ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ముఖం టాన్ అవుతుంది. నీళ్లు తాగండి: మనం ఎంత ఎక్కువ నీరు తాగితే మన శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఇది మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఇది చర్మానికి మంచి గ్లో రావడానికి సహాయపడుతుంది. ఇది ముఖంలోని కొవ్వును తొలగించడంలో కూడా బాగా పనిచేస్తుంది. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. నిద్ర: మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే బాగా నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. నిద్ర లేకపోవడం వల్ల ముఖంపై ముడతలు, నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇది కూడా చదవండి: ఇలా ఆవిరి పట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఖాయం..ఈ జాగ్రత్తలు తీసుకోండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #running #fat-on-face #everyday #cycling మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి