Health Tips : మధుమేహంతో బాధపడేవారు ఏ పప్పులు తినవచ్చు.. ఏ పప్పులు తినకూడదో తెలుసా? మధుమేహం ఉన్న వారు తమ ఆహారంలో నుంచి మినపప్పుని తీసివేసి... పెసరపప్పు, కందిపప్పు, పచ్చి శెనగపప్పును ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. మాంసకృత్తులతో పాటు, పప్పులు తినడం వల్ల ఫోలేట్, జింక్, ఐరన్ అనేక అవసరమైన విటమిన్లు లభిస్తాయి. By Bhavana 09 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Life Style : ప్రస్తుత జీవనశైలి(Life Style), మారుతున్న ఆహారపు అలవాట్ల(Food Habits) కారణంగా చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం(Diabetes) సమస్యను ఎదుర్కొంటున్నారు. స్థూలకాయం పెరగడం కూడా మధుమేహానికి ప్రధాన కారణం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా రక్తంలో చక్కెర స్థాయి(Sugar Levels) వేగంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది కొన్నిసార్లు తీవ్రమైన పరిస్థితికి దారి తీస్తుంది. డయాబెటిక్ పేషెంట్ ఏ పప్పులు తినాలి... ఏ పప్పులు తినకూడదో తెలుసుకుందాం? మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పప్పులు తినకూడదు? రక్తంలో చక్కెర సాధారణం కంటే ఎక్కువగా ఉండటం మధుమేహ వ్యాధి. ఒకసారి శరీరంలోకి మధుమేహం వచ్చింది అంటే దానిని శరీరం నుంచి బయటకు పంపడం చాలా కష్టం. ఆహారం, జీవనశైలిని మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధుమేహ రోగులు మినపప్పు తినకూడదు. ముఖ్యంగా ఎక్కువ నెయ్యి లేక వెన్నతో చేసిన దాల్ మఖానీని తినడం మానుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పప్పులు తినాలి మినపప్పు(Minapapu) ని మీ ఆహారం లిస్ట్ లో నుంచి తీసివేసి... పెసరపప్పు, కందిపప్పు, పచ్చి శెనగపప్పును ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. మాంసకృత్తులతో పాటు, పప్పులు తినడం వల్ల ఫోలేట్, జింక్, ఐరన్ అనేక అవసరమైన విటమిన్లు లభిస్తాయి. మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి మధుమేహాన్ని నియంత్రించడం చాలా సులభం. ఇందుకోసం జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రోజూ కనీసం 1 గంట నడవండి. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, మల్టీగ్రెయిన్ పిండి రోటీలను చేర్చండి. రోజూ కొంత వ్యాయామం చేయండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. Also Read : భైరవగా ప్రభాస్.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న కల్కి పోస్టర్ #health #diabetis #health-tips #lifestyle #pulses సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి