Telangana : కేసీఆర్ అవినీతిని గ్రామగ్రామాన చాటిచెప్పండి.. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం పిలుపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం, కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని గ్రామగ్రామాన చాటిచెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. By srinivas 07 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Gandhi Bhavan : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్ల కోసం భారీ అవినీతికి పాల్పడినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకోసం పార్టీ వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన ‘తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ’(పీఈసీ) సమావేశానికి అధ్యక్షత వహించారు. గ్రామగ్రామాన చాటిచెప్పండి.. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. గత ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ అక్రమాలను గ్రామగ్రామాన చాటిచెప్పాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిందని చెప్పారు. ఈ ప్రాంతంలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని బీఆర్ఎస్ కు తెలుసు. అందుకే ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించిందని దుష్ప్రచారం చేసి.. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది కూడా చదవండి : Murder: ఒకరితో ప్రేమ మరోకరితో శృంగారం.. చివరికి ఏమైందంటే! బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టండి.. మేడిగడ్డ అవినీతిపై విచారణ, కఠిన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని గ్రహించి.. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించారంటూ కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ నేతలంతా బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టి గ్రామాలకు వెళ్లి గత ప్రభుత్వ అవినీతిపై బలంగా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే టికెట్ల కేటాయింపులో అన్ని సామాజికవర్గాలకు పార్టీ ప్రాధాన్యమిస్తుందని చెప్పిన సీఎం.. ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా అభ్యర్థుల ఎంపిక, నేతల పనితీరు ఉండాలన్నారు. #brs #kcr #congress #cm-reavanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి