ChatGPT: అస్సాం ట్రైన్‌ ఎక్కనున్న ఛాట్‌జీపీటీ.. దివాలా తీయనున్న 'ఓపెన్‌ ఏఐ'!

'ఓపెన్‌ఏఐ'(OpenAI) నష్టాలు పేరుకుపోతున్నాయి. ఛాట్‌జీపీటీ కోసం రోజుకు 5 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని కారణంగా సామ్ ఆల్ట్‌మన్ కంపెనీ నష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఓవైపు ఛాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతుండడంతో పాటు ఖర్చు పెరిగిపోతుండడంతో 2024చివరి నాటికి 'ఓపెన్‌ఏఐ' దివాలా తీసే అవకాశాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ ఈ భారాన్ని భరిస్తున్నట్టు సమాచారం.

New Update
ChatGPT: అస్సాం ట్రైన్‌ ఎక్కనున్న ఛాట్‌జీపీటీ.. దివాలా తీయనున్న 'ఓపెన్‌ ఏఐ'!

OpenAI might to bankrupt by 2024: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(Artificial Intelligence)కి మాన్యూవల్‌ కష్టాలు పెరుగుతున్నాయి. అంటే డబ్బుల కష్టాల అన్నమట. ఇటివలే ఆండ్రాయిడ్‌లో దర్శనమిచ్చిన ఓపెన్‌ఏఐ(OpenAI)కి చెందిన ఛాట్‌జీపీటీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్యను క్రమక్రమంగా కోల్పోతూ వస్తోంది. ఇదే సమయంలో 'ఓపెన్‌ఏఐ'కి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఛాట్‌జీపీటీని రన్‌ చేసేందుకు రోజుకు ఏకంగా 5 కోట్ల ఖర్చు అవుతుందట. ఓవైపు యూజర్ల సంఖ్య తగ్గుతూ ఉండడంతో పాటు ఖర్చు పెరుగుతూ ఉండడంతో కంపెనీ దివాలా తీసే అవకాశాలున్నాయి నివేదికలు చెబుతున్నాయి.

ఛాట్‌జీపీటీ ఛాప్టెర్‌ క్లోజ్ ?:
గతేడాది నవంబర్‌ నుంచి AI చాట్‌బాట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా 'ఓపెన్‌ఏఐ'కి చెందిన 'ఛాట్‌జీపీటీ' అందుబాటులోకి వచ్చింది. ప్రారంభమైన కొత్తలో ఛాట్‌జీపీటీకి ఉన్న డిమాండ్‌.. ట్రాఫిక్‌ ఇప్పుడు లేదు. అందుకు ఈ లెక్కలే సాక్ష్యం. జూన్‌లో 170 కోట్ల మంది వైరల్ AI చాట్‌బాట్‌ను ఉపయోగించగా.. జూలైలో ఆ సంఖ్య 150 కోట్లకు తగ్గింది. అంటే యాక్టివ్ యూజర్ల సంఖ్య ఒక్క నెలలోనే 12శాతానికి తగ్గింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజీనిర్లు అడిగిన ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ తప్పుడు సమాధానాలు ఇస్తుండడంతో చాలా కంపెనీలు ఛాట్‌జీపీటీ(ChatGPT) ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నాయి. అటు ఐటీ ఉద్యోగులు సైతం దీనికి దూరంగా జరుగుతున్నారు. 'స్టాక్‌ ఓవర్‌ఫ్లో'పైనా మళ్లీ ఆధారపడుతున్నారు.

2024లో ఏం జరగబోతోంది ?
అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకారం యాక్టివ్‌ యూజర్ల సంఖ్యను 'ఓపెన్‌ ఏఐ' క్రమక్రమంగా కోల్పోతోంది. ఇక కంపెనీకి నష్టాలు కూడా పేరుకుపోతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్ లేకపోయి ఉంటే ఇప్పటికే 'ఓపెన్‌ ఏఐ' దివాలా తీసి ఉండేదని సమాచారం. ఓవైపు నష్టాలు.. మరోవైపు రోజుకు 5కోట్ల ఖర్చు భరించడం అంటే ఎంతో కాలం సాధ్య పడదు. అటు ఉద్యోగులకు భారీ జీతాలతో పాటు లండన్‌లోనూ కంపెనీ కార్యాలయాలను విస్తరించింది. ఇవన్నీ కంపెనీ నిర్వహణ ఖర్చును అమాంతం పెంచుతున్నాయి. నిజానికి ఛాట్‌జీపీటీ ప్రారంభించినప్పటి నుంచి సామ్ ఆల్ట్‌మన్ కంపెనీ నష్టాలు రెట్టింపు అయ్యాయని నివేదికలు కూడా చెబుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే 2024 చివరి నాటికి కంపెనీ దివాలా తీసే అవకాశాలున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు