Priyanka Gandhi: ఖమ్మం నుంచి ఎంపీగా ప్రియాంక పోటీ?

తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం ఎంపీ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. సోనియా గాంధీ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరగగా.. తాజాగా ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లాలని అనుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Priyanka Gandhi: ఖమ్మం నుంచి ఎంపీగా ప్రియాంక పోటీ?
New Update

Priyanka Gandhi: మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో ప్రియాంక గాంధీ లేదా సోనియా గాంధీని పోటీ దింపాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

ALSO READ: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

రాజ్యసభకు సోనియా గాంధీ..?

తెలంగాణ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇది వరకే తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణను ఇచ్చిన సెంటిమెంట్ వల్ల సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే ఈజీగా గెలుస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తాజాగా రాజ్యసభకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లేదా హిమాచల్ నుంచి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆరోగ్యం, వయోభారం రీత్యా రాజ్యసభకు వెళ్లాలని సోనియాగాంధీ అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తెరపైకి ప్రియాంక గాంధీ...

సోనియా గాంధీ తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు నో చెప్పడంతో ఇప్పుడు ప్రియాంక గాంధీ పేరు తెర పైకి వచ్చింది. ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రియాంకను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారట. ఖమ్మం నుంచి పోటీ చేసే ఆలోచనలో ప్రియాంక గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లేదా రాయ్‌బరేలీ స్థానాలపై ఏఐసీసీ సమాలోచన చేస్తోంది. ఖమ్మం లోక్‌సభ స్థానం కోసం పలువురు నేతలు ఇప్పటికే పోటీ పడుతున్నారు. ఖమ్మం టికెట్ ఆశిస్తున్న వారిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, భట్టి సతీమణి మల్లు నందిని, తుమ్మల తనయుడు యుగంధర్, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంత రావు ఉన్నారు. మరి సోనియా గాంధీ లేక ప్రియాంక గాంధీ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయకపోతే ఆ టికెట్ ను ఎవరికి కేటాయిస్తారనే చర్చ కాంగ్రెస్ నేతల్లో మొదలైంది.

ALSO READ: కేసీఆర్‌ పచ్చి అబద్ధం చెప్పారు – రేవంత్‌ రెడ్డి

#priyanka-gandhi #congress-party #mp-elections-2024 #sonia-gandhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి